English | Telugu

తగ్గని మెగాస్టార్‌ జోరు.. మన శంకర వరప్రసాద్‌గారి కలెక్షన్ల సునామీ!

ఈ సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ యునానిమస్‌గా సంక్రాంతి విజేతగా నిలిచాడు. అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా పండగకు పర్‌ఫెక్ట్‌ సినిమా అనిపించుకుంది. ఆరు రోజులు గడిచేసరికి చిరంజీవి కెరీర్‌లోనే రికార్డు స్థాయి ఫిగర్స్‌ కనిపిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే 84 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్‌. నాలుగు రోజుల్లో 200 కోట్ల క్లబ్‌లో ఎంటర్‌ అయింది. ఆరు రోజులకు 261 కోట్లు కలెక్ట్‌ చేసి 300 కోట్ల వైపు వేగంగా దూసుకెళ్తోంది మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌.

‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ ప్రేక్షకుల అంచనాలను మించి సందడి చేస్తోంది. ఫుల్‌ ఫామ్‌లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచే థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌, ఎనర్జిటిక్‌ డాన్స్‌ స్టెప్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అయి మరో రికార్డు నెలకొల్పింది. ఐదో రోజు అదనంగా రూ.26 కోట్ల గ్రాస్‌ రాబట్టి మొత్తం వసూళ్లను రూ.226 కోట్లకు చేర్చింది. తాజాగా మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌ ప్రకారం, ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించింది. మెగాస్టార్‌ చిరంజీవి స్టామినా, అనిల్‌ రావిపూడి బ్రాండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసొచ్చి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ను బాక్సాఫీస్‌ వద్ద సంచలనంగా మార్చాయి. ఈ సినిమా 300 కోట్ల మైలురాయి దాటితే చిరంజీవి కెరీర్‌లో ఓ అరుదైన రికార్డు అనే చెప్పాలి.