పూజాహెగ్డే జోడి ఎవరో తెలిసిపోయింది! ఇతనే ఆ హీరో
తెలుగులో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్ స్థాయికి వెళ్లిన నటి 'పూజాహెగ్డే'(Pooja hegde). 2022 లో రిలీజైన 'ఆచార్య' తర్వాత పూజాకి తెలుగులో ఎలాంటి సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. హిందీలో మాత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్, సర్కస్, దేవా వంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది సూర్య(Suriya)హీరోగా వచ్చిన 'రెట్రో మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకులని పలకరించింది.