English | Telugu
మలేషియాలో శుద్ధ్ విలాస్ ప్రారంభం
Updated : Jan 17, 2026
మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ శరీ Dr M శరవణన్ చేతుల మీదుగా మలేషియాలోని సైబర్ జయ అనే ప్రదేశంలో జనవరి 5న శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో శుద్ధ్ విలాస్ మొదటి బ్రాంచ్ ఉండగా.. ఇప్పుడు మలేషియాలో రెండో బ్రాంచ్ మొదలు పెట్టడం, అక్కడి ప్రజలకు కూడా బెస్ట్ హైజీన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అందించనుండటం పట్ల ఆనందంగా ఉందని శుద్ధ్ విలాస్ యాజమాన్యం చెబుతోంది. గ్లోబల్ వైజ్ ఇంకా చాలా దేశాల్లో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్‌గా తమ బ్రాంచెస్ ఓపెన్ చేయనున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, శుద్ధ్ విలాస్ వ్యవస్థాపకులు శశికాంత్, శ్రీరామ్, ఇతర భాగస్వాములు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. "హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓపెన్ చేసిన శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అక్కడి కస్టమర్స్ తాము అందించే ఫుడ్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు మలేషియాలో ఓపెన్ చేశాము. త్వరలోనే దుబాయ్ సహా ఇంకా మరిన్ని దేశాల్లో రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాము. బెస్ట్ హైజీన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అందించడమే లక్ష్యంగా మా రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నాము. పలు వెరైటీ ఫుడ్స్ అందిస్తూ అత్యుత్తమ నాణ్యతతో టిఫిన్స్ మరియు భోజనం రెడీ చేసిపెడతాము. ఆహార ప్రియులకు పూర్తి సంతృప్తికర ఫుడ్ అందించడమే లక్ష్యంగా శుద్ధ్ విలాస్‌ను దేశ విదేశాల్లో విస్తరించుకుంటూ వెళ్తాము" అని అన్నారు.
ఆరోగ్యకరమైన, హైజీన్ ఆహారానికి ఉన్న, పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మలేషియాకు శుద్ధ్ విలాస్ రావడం పట్ల స్వాగతిస్తున్నామని, తమ ప్రజలకు కూడా బెస్ట్ ఫుడ్ అందించి శుద్ధ్ విలాస్ బ్రాండ్ ప్రాముఖ్యత చాటుకోవాలని మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ శరీ Dr M శరవణన్ అన్నారు.