అదొక సామ్రాజ్యం.. స్వయంభు రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన నిఖిల్
పాన్ ఇండియా ప్రేక్షకులకే కాదు చైనీస్, అరబిక్, స్పానిష్ లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా భారతదేశ చరిత్రలో ఎవరు గుర్తించని ఒక గొప్ప యోధుడి జీవిత చరిత్రని చెప్పబోతున్న మూవీ 'స్వయంభు(Swayambhu). యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన 'నిఖిల్ సిద్దార్ధ్'(Nikhil Siddhartha)మరోసారి స్వయంభు తో అభిమానులని ప్రేక్షకులని తన వశం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.