జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన 'భగవంత్ కేసరి'.. షారుఖ్ కి పోటీగా ఆ హీరో!
71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' సత్తా చాటింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే 'హనుమాన్', 'బేబీ' వంటి తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో హనుమాన్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో బేబీ అవార్డులు గెలుపొందాయి.