English | Telugu
చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. బిగ్ ఫైట్ తప్పదా?
Updated : Jan 17, 2026
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ.. ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. ఫుల్ రన్ లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్ ని అటు చిరంజీవి, ఇటు రావిపూడి ఇద్దరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 'చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి' అనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. (Mana Shankara Vara Prasad Garu)
రీ ఎంట్రీ తర్వాత చిరంజీవికి సంక్రాంతి ఎంతగానో కలిసొస్తుంది. 'ఖైదీ నెం.150', 'వాల్తేరు వీరయ్య', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలు సంక్రాంతికే విడుదలై సక్సెస్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ సంక్రాంతిపై కూడా చిరంజీవి కన్నేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తన 158వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్స్.. చిరంజీవి సంచలన రికార్డు!
అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి దర్శకుడిగా పేరుంది. ఇప్పటిదాకా ఆయన తొమ్మిది సినిమాలు డైరెక్ట్ చేయగా.. అందులో నాలుగు సంక్రాంతికి విడుదలై సక్సెస్ అయినవే. 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించాయి. ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ సంక్రాంతిపై కూడా అనిల్ కర్చీఫ్ వేస్తున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ ని వెంకటేష్ తో ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమాని 2027 సంక్రాంతికి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ
మొత్తానికి 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి, అనిల్ రావిపూడి.. 2027 సంక్రాంతికి సై అంటే సై అంటూ బరిలో దిగబోతున్నారన్నమాట. మరి రాబోయే పొంగల్ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.