సుధీర్, గెటప్ శీను లేకుండా ఒక్కడినే స్టేజి ఎక్కినప్పుడు గుండె ఆగిపోయిన్నట్టుగా ఉంది
సర్కార్ సీజన్ 5 ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఎందుకు అంటే ఈ వీక్ ఎపిసోడ్ కి వచ్చింది జబర్దస్త్ టీమ్. అంటే సుధీర్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ. వీళ్లందరి అల్లరి మాములుగా లేదు. కింద పడి దొర్లి దొర్లి జోక్స్ వేసుకున్నారు. ఇక సుధీర్ ఐతే ఒక టైంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో స్పైసీ ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగేసరికి..రాంప్రసాద్ చెప్తూ ఏడ్చినంత పని చేసాడు. "సీరియస్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏడ్చింది లేదు. ఒక్కసారి నేను మీ ఇద్దరూ లేకుండా ఒక షో కోసం స్టేజి ఎక్కా..కుడి భుజం, ఎడం భుజం లేకుండా అంటారు కదా అలా కూడా కాదు. నాకు మెదడు, గుండె పని చేయనంతలా ఐపోయింది.