English | Telugu

విజయ్ కార్తీక్‌తో నా పెళ్లి.. కానీ వాడు నన్ను మోసం చేశాడు

​బుల్లితెర మీద కీర్తి భట్ బాగా ఫేమస్. సీరియల్ నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఐతే ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "నేను మానేయాలి అనుకుంటే వ్లాగ్స్ చేయడం మానేస్తా. వ్లాగ్స్  తిప్పలు నా వల్ల కాదు. షోస్, సీరియల్స్ మాకు జీవితాన్ని ఇస్తుంది కాబట్టి అవి చేస్తాను. ఇక నా పెట్ నేమ్ చిన్నప్పుడు పుట్టి ఇప్పుడు పాపు. నా ఫ్రెండ్స్ ని విజయ్ కార్తీక్ తన ఫామిలీలాగే చూస్తాడు. ఇక బాడ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా బాత్ రూమ్ లో ఉంటాడు లేదంటే టీవీలో మునిగిపోతాడు. ఇక నా సెలబ్రిటీ క్రష్ వచ్చి యష్. విజయ్ కార్తీక్ తో నా పెళ్లి ఈ ఇయర్ ఎండింగ్ కి ఉంటుంది. ఈ ఇయర్ నా పుట్టినరోజును ఒక వృద్ధాశ్రమంలో సెలెబ్రేట్ చేసుకున్న. అది చాల బెస్ట్ బర్త్ డే. బోర్ మూమెంట్ అనేది నాకు రాదు.

Karthika Deepam2 : కాశీకి డీల్ ఇచ్చిన జ్యోత్స్న.. ఇంట్లో రచ్చ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -403 లో....దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. గౌతమ్ మంచివాడు కాదు కదా.. జ్యోత్స్న పెళ్లి అతనితో జరిగితే పరిస్థితి ఏంటని దీప అనగానే జ్యోత్స్నకి గౌతమ్ గురించి తెలుసు కాబట్టి జ్యోత్స్న సిచువేషన్ అంతవరకు తెచ్చుకోదు కానీ నువ్వు మాత్రం జ్యోత్స్న దగ్గరికి వెళ్లి గౌతమ్ మంచివాడు కాదని చెప్పే ప్రయత్నం చేసావనుకో జ్యోత్స్న అది రికార్డు చేసి ఇంట్లో వాళ్లకి వినిపిస్తుంది. దాంతో నువ్వు మళ్ళీ పెళ్లి చెడగొడుతున్నావని ఈ సారి మా అత్త ఇంట్లో నుండి నిన్ను గెంటేస్తుంది.

Brahmamudi: రాజ్ చెప్పినవి విని షాకైన సిద్దార్థ్.. కావ్య హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -767 లో..... రాజ్ ఆఫీస్ కి వెళ్లి ఎంప్లాయిస్ అందరిని పిలిచి.. మీరు వర్క్ సరిగా చెయ్యడం లేదని కోప్పడతాడు. ఇప్పుడే మీ అందరిని ఉద్యోగం నుండి తీసేస్తున్నానని రాజ్ అనగానే అందరు టెన్షన్ పడతారు. అప్పుడే కావ్య ఎంట్రీ ఇచ్చి.. సూపర్ బాస్.. ఫ్రాంక్ చాలా బాగుందని అంటుంది. ఇదంతా సర్ ఫ్రాంక్ చేశారు.. మీరు అందరు వెళ్ళండి అని కావ్య అనగానే అందరు వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నారు బాస్ లాగా నటించమంటే ఎందుకిలా చేస్తున్నారని రాజ్ పై కావ్య కోప్పడుతుంది.

చిరంజీవిగారి అమ్మకు నేనంటే ఇష్టం..

మొగలిరేకులు అంటే చాలు ముందుగా గుర్తొచ్చేది ఆర్కే.నాయుడు రోల్. ఇక ఆయన సీరియల్ తర్వాత కొన్ని మూవీస్ లో నటించారు. లేటెస్ట్ గా సుమ చాట్ షోకి వచ్చారు. "చిరంజీవి గారి అమ్మ గారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను అభిమానిస్తారు. నాకు ఆమె ఆ దేవుడిచ్చిన అమ్మ అనుకుంటాను. చిరంజీవి గారి తాతయ్య గారి పేరు కూడా ఆర్కే.నాయుడు. ఆయన కూడా ఒక పోలీస్ గా చేసారు. అందుకే చిరంజీవి గారి వాళ్ళ అమ్మగారు నన్ను చూసినప్పుడల్లా వాళ్ళ నాన్న గారిని చూసినట్టే ఉంటుంది అనేవారు. నాకు చాలా టచింగ్ గా అనిపిస్తుంది అమ్మ మాట. ఇక పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉన్నాను. జనసేనలో చేరాను. పార్టీ కాకముందు ఆయనతో ఫోటో దిగాను. ఇప్పుడు ది 100 మూవీ ప్రొడ్యూసర్ వెంకీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తీసుకెళ్లారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడూ మర్చిపోలేను. నేను అక్కడికి వెళ్లేసరికి ఆయన వేరే వరల్డ్ లో ఉన్నారు. ఏదో పొలిటికల్ బుక్ చదువుతూ ఉన్నారు. ఆయన నన్ను చూసి మీరా మా అమ్మ మీకు  పెద్ద ఫ్యాన్ తెలుసా అంటూ లేచి హగ్ చేసుకున్నారు. చాలా షాకయ్యా.

మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ వలన చాలా డిస్టర్బ్ అయ్యాను..

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ అనగానే ఆర్కె. నాయుడు అలియాస్ సాగర్ గుర్తు రాకుండా ఉండరు. రీసెంట్ గా అతను "ది 100 " అనే మూవీలో నటించాడు. నటుడిగా కాకుంటే పోలీస్ అవ్వాలనే కల ఉండేదని సుమ చాట్ షోలో చెప్పుకొచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్, రంగస్థలం మూవీస్ లో ఛాన్సెస్ వచ్చాయి కానీ దాని వెనక స్టోరీ కూడా చెప్పారు. "మొగలి రేకులు పీక్ లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో శివాజీ అనే క్యారెక్టర్ గురించి చెప్పారు. ప్రభాస్ గారికి సెకండ్ లీడ్ గా అని చెప్పారు. ఐతే అప్పటికి నాకు మూవీస్ కి వెళ్లాలన్నా ఆలోచన లేదు. సీరియల్స్ లో చక్కగా నడుస్తోంది కదా అనుకున్నా. మంజుల నాయుడు గారికి ఇలా ఒక అవకాశం వచ్చింది అని అడిగాను.

అందాల రాక్షసి హిట్ కానీ అవకాశాలు ఫట్.. 

అందాల రాక్షసి మూవీతో హిట్ కొట్టిన నవీన్ చంద్ర యాక్టింగ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆ మూవీ తర్వాత గ్యాప్ రావడం ఆ తర్వాత అరవింద సమేత చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కాకమ్మ కథలు ఎపిసోడ్ కి వచ్చి తన లైఫ్ లోని స్ట్రగుల్స్ గురించి చెప్పాడు. " పాపింగ్, రాకింగ్, బి-బాయింగ్ , బ్రేక్ డాన్స్ ఇవన్నీ రకరకాల డాన్స్ స్టైల్స్ నేను ఎక్కడా నేర్చుకోలేదు. మా బ్రదర్ నేర్పించాడు. మా ఊళ్ళో డాన్స్ షో పెడితే మా ఊరి వాళ్ళు టికెట్స్ కొని మరీ షో చూసేవాళ్ళు. అప్పుడే నాకు యాక్టర్ అవ్వాలనుకున్నాను ఇక్కడికి వచ్చాను. తేజ గారి వల్లనే వచ్చాను. ఆయన ఒక యాడ్ పోస్ట్ చేసారు. నవదీప్ ది జై మూవీ.

రేవతిగారితో నటించిన మూవీ రిలీజ్ కాలేదు.. 

సిల్వర్ స్క్రీన్ మీద రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో ఎన్నో రోల్స్ లో నటించాడు. ఆయన జర్నీ చాలా సుదీర్ఘమైనది. ఇప్పటికీ ఎన్నో మూవీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా అయన కాకమ్మ కథలో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చాను. నేను మెస్ లో భోజనం చేస్తున్నప్పుడు ఒకాయన వచ్చి ఇలా రేవతి గారితో ఒక మూవీ చేస్తున్నారు. హీరో కోసం వెతుకుతున్నారు. మీరు చేస్తారా అని అడిగారు. నేను హీరో ఏంటి అనేసరికి లేడు రండి అని నన్ను తీసుకెళ్లారు. మేము వెళ్లేసరికి డైరెక్టర్ గారు. అప్పట్లో నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. రెండో రోజు ఫోన్ చేసి పిలిస్తే వెళ్లాను. చూసి ఎవడ్రా నువ్వు అన్నారు. సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు కృష్ణ గారితో. నేనే సర్ రమేష్ ని అన్న. ఓరిని రమేష్ అరవింద్ అనుకున్న రమేషా నువ్వు అన్నారు. సరే బానే ఉన్నావ్ గాని రా అని రేవతి గారి దగ్గరకు తీసుకెళ్లారు. హీరోగా వీడు ఓకేనా అని అడిగారు. అప్పటికే ఆవిడ నేషనల్ అవార్డు అందుకున్న పెద్ద ఆర్టిస్ట్.

"ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా"

సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ ఐతే అవసరమైనప్పుడల్లా ప్రాపెర్టీస్ తెచ్చే అమ్మాయి లస్సి మీద ఫుల్ జోకులు వేసాడు. లస్సి స్టేజి మీదకు వచ్చేసరికి "పెరుగు ఎవరు తోడెట్టారో కానీ లస్సి అద్దిరిపోయింది" అని జోక్ వేసాడు. సుధీర్ ఐతే "ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా" అన్నాడు. "నాకు ఒక స్ట్రా తెస్తావా లస్సి" అని అడిగాడు మళ్ళీ రాంప్రసాద్. లస్సి చేతిలో ఒక ప్రాపర్టీ ఉంది. "అరేయ్ సుధీర్ లస్సిని పట్టుకురమ్మను. ఇంతదూరం వచ్చింది నిన్ను చూడడానికి కాదు. లస్సి ఇటురా" అని పిలిచాడు రాంప్రసాద్.

Illu illalu pillalu : ఆనందరావు ఇడ్లీల బిజినెస్ చెప్పేసిన నర్మద,ప్రేమ.. షాక్ లో శ్రీవల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -202 లో... శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ పై ఇడ్లీలు అమ్ముతుంటే నర్మద, ప్రేమ ఇద్దరు వెళ్లి అతన్ని చూస్తారు. అతను ఈ ఇద్దరిని చూడగానే షాక్ అవుతాడు. వెంటనే త్వరగా డైవర్ట్ చేస్తాడు. ఇలా ఇడ్లీలు అమ్ముకోవాలని అంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లి సూట్ వేసుకుంటాడు. ఏంటి బాబాయ్ ఇలా ఇడ్లీ అమ్ముతున్నారని ప్రేమ, నర్మద అడుగుతారు. అదేం లేదమ్మా నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను కదా.. అలాగే ఎలా బిజినెస్ చెయ్యాలో కూడా నేర్పిస్తానని కవర్ చేస్తాడు.