Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సావిత్రి.. అడ్రెస్ కనిపెట్టగలడా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -609 లో......రాజ్, కావ్య లు వెళ్తుంటే ఒకతను లిఫ్ట్ అడుగుతాడు. అతను రాజ్, కావ్య లని పరిచయం చేసుకుంటాడు. నా పేరు సావిత్రి అంటూ చెప్పగానే అదేంటి అమ్మాయి పేరు పెట్టుకున్నావని రాజ్, కావ్య అడుగగా.. తన పేరు వెనకున్న స్టోరీని సావిత్రి చెప్పుకొస్తాడు. అదేంటి అంత దరిద్రమైన జాతకమా అని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానని సావిత్రి చెప్తాడు.