English | Telugu
బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈసారి అంతా కలర్ ‘ఫుల్లే’!
Updated : Jul 13, 2025
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా, మరెంతో ఉత్సాహంతో చూసే షో బిగ్‌బాస్. ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. సీజన్ 8 కొంత వెరైటీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ షోకి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసే ప్రక్రియ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు వంద మంది నుంచి 25 మందిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
సీజన్ 9కి హోస్ట్‌గా ఎవరు ఉంటారు అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా నాగార్జునే సీజన్ 9ని నిర్వహిస్తారని కన్‌ఫర్మ్ అయిపోయింది. కొత్త హోస్ట్ రాబోతున్నారనే ప్రచారంలో విజయ్ దేవరకొండ, బాలకృష్ణతో సహా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన వార్తలేనని తర్వాత తేలిపోయింది. చివరికి నాగార్జుననే ఫైనల్ చేశారు. సీజన్ 9కి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ చేశారు. అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రతి సీజన్‌కి ముందు కొందరి పేర్లు వినిపిస్తాయి. అందులో కొంత శాతం నిజం ఉంటుంది. అన్ని సీజన్లలోనూ ఇదే జరిగింది. తాజాగా సీజన్ 9కి సంబంధించి కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చేశాయి. బుల్లితెర నుంచి సాయికిరణ్, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యూల్, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లో రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని ఎంపికయ్యారని తెలుస్తోంది. చూడబోతే ఈసారి బిగ్‌బాస్ కలర్‌ఫుల్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది. వీరు కాకుండా దెబ్జానీ, సుమంత్ అశ్విన్, శివకుమార్, ముఖేష్ గౌడ, నవ్యసామిలతోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 7న ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ సీజన్ 9 కోసం అంతా ఎదురుచూస్తున్నారు.