English | Telugu

శ్రీదేవి డ్రామా కంపెనీలో అంజలి సీమంతం..కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ, రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ప్రోమోలో అంజలిపవన్ కి సీమంతం చేసే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ సీమంతం చేసింది ఎవరో కాదు హోస్ట్ తమ్ముడు రవి..."నేను చందమామ కలిసి మా అక్కకు సీమంతం చేస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు. భార్య సీమంతం సందర్భంగా పవన్ ఐతే ఫుల్ జోష్ తో యమా స్పీడ్ తో డాన్స్ చేసాడు. కానీ ఆ స్పీడ్ డాన్స్ తనకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళ నాన్న పరువు తీసేసింది చందమామ. ఇక శ్రీ సత్య, చందమామ కలిసి "చల్ల గాలి" సాంగ్ కి ఐ-ఫీస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత సెట్ లో ఉన్నవాళ్ళంతా కలిసి వచ్చి అంజలికి సీమంతం చేసారు. ఇక పవన్ తన భార్యకు గాజులు తొడిగాడు. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని ఈ గాజులు వేస్తున్నా అని చెప్పాడు. తర్వాత రవి ఒక స్కిట్ వేసాడు. ప్రతీ ఇంట్లో మామఅల్లుడు ఎలా ఉంటారో తెలిపే రిలేషన్ ని ఈ స్కిట్ లో చూపించారు.

పేగు మెళ్ళో వేసుకుని పుట్టిన మేనల్లుడిని చూస్తే అరిష్టం అనే కాన్సెప్ట్ మీద ఈ స్కిట్ నడిచింది అలాగే రవికి పెళ్లయ్యాక మేనమామతో రిలేషన్ చాలా తగ్గిపోతుంది అనేది కూడా చూపించారు. ఇక ఇంద్రజ, రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ స్కిట్ చూసి. "ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేరు అని నేను చాలా చాలా ఫీలైన సందర్భాలు ఉన్నాయి "హార్ట్ టచ్చింగ్ పెర్ఫార్మెన్స్ నిజంగా చాల బాగుంది అక్షరంలో ఒక్క మా కాదు రెండు మా లు ఉంటాయి. "మామా" అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుని రష్మీ. తర్వాత స్టేజి మీద అంజలి సోదరుడు వచ్చాడు. "ఒక నాలుగేళ్లు అనుకుంట వాడు నేను అసలు మాట్లాడుకోలేదు" అని చెప్పి ఏడ్చేసింది. ఈ ప్రోమోలో చాన్నాళ్లకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ వచ్చి "చెలియా నిను చూడకుండా" "దేవుడు వారమందిస్తే" అనే అనే సాంగ్స్ పాడారు. దాంతో రవి "మీరు పాట పాడుతుంటే నాకు క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది" అంటూ చెప్పాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.