English | Telugu

కూతురి గురించి చెప్తూ ఎమోషనల్ అయి‌న సుమిత్ర.. ఏడ్చేసిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -408 లో... సుమిత్రకి కాఫీ తీసుకొని వస్తుంది దీప. ఏంటి ఏ టైమ్ కి ఏం తింటానో ఏం తాగుతానో అన్ని తీసుకొని వస్తున్నావ్.. నేను ఇంతలా ఛీకొడుతున్నా.. నీకు ఏం అనిపించడం లేదా అని దీపని సుమిత్ర అంటుంది. నాకొక హెల్ప్ చెయ్యాలి. ఈ చీర నా ఆడపడుచు కోసం కొన్నాను. నువ్వే తనకి ఇవ్వాలని సుమిత్ర అనగానే.. నేను ఇవ్వలేను.. మీరే ఇస్తే బాగుంటుందని దీప అంటుంది.

నువ్వు ఎక్కడ మళ్ళీ ఈ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేస్తావోనని భయమవుతుంది.. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం.. జ్యోత్స్న తన కడుపులో పడ్డప్పుడు డాక్టర్ నేను బ్రతకనని చెప్పాడు కానీ ఉంటే మేమ్ ఇద్దరం ఉండాలని చెప్పాను. అలా జ్యోత్స్న నాకు పుట్టినప్పటి నుండి చాలా ఇష్టంగా పెంచుకున్నానని సుమిత్ర ఎమోషనల్ అవుతుంటే.. నీ కన్నకూతురు నేనే అని చెప్పలేక దీప బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

దీప బాధపడుతుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏమైందని దీపని కార్తీక్ అడుగుతాడు. మా అత్త ఏమైన అందా అని కార్తీక్ అడుగుతాడు. అమ్మ ఏం అనలేదు.. నా వల్ల తను బాధపడుతుందని దీప అంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. ఎంగేజ్ మెంట్ కి మీ అమ్మని పిలువు అంటాడు. ఎలా పిలవాలి.. డ్రైవర్ అమ్మగా పిలవాలా.. లేక ఈ ఇంటికి ఆడపడుచుగా పిలవాలా అని కార్తీక్ అంటాడు. అది మీ ఇష్టమని శివన్నారాయణ అనగానే నేను పిలవను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. నీతో ఎలా పిలిపించాలో నాకు తెలుసని శివన్నారాయణ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.