హైపర్ ఆది : కావ్య కాలేజీలో నేను ఉండి ఉంటే 500 ల సార్లు నేనే ప్రపోజ్ చేసేవాడిని
బుల్లితెర మీద చాలా షోస్, ఈవెంట్స్ ప్రసారమవుతూ ఉంటాయి. వీటి షూటింగ్ టైమ్స్ లో ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక షో రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారమయ్యింది. అదే న్యూ ఇయర్ దావత్ లొకేషన్ హోమ్ టూర్ షో. అందులో కావ్య, రీతూ చౌదరి, ఆది మధ్య మంచి కామెడీ జరిగింది. రీతూ చౌదరి వచ్చి "హాయ్ కావ్య..వాట్సాప్..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "ఇలా ఉన్నా" అని కావ్య చెప్పేలోపు ఆది వచ్చేసాడు. "హాయ్ కావ్య..ఎలా ఉన్నావ్" అని అడిగాడు. " బాగున్నాను" అని చెప్పింది కావ్య. "ఆది నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పవు కానీ కావ్యను అడిగినప్పుడు మాత్రం వచ్చేస్తావ్" అంటూ రీతూ చౌదరి ఆది మీద అరిచింది. "కావ్య నచ్చని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరూ" అని ఆది కావ్య గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు. "నా లైఫ్ లో కావ్య అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సీరియస్ గానే చెప్తున్నా ఈ విషయం.