తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 యూ.ఎస్. ఏ ఫైనలిస్ట్స్ వీళ్ళే
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్ మొదలయ్యాయి. ఆహా ప్లాటుఫారం మీద ఈ షో ఇప్పటికే 3 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఐతే లాస్ట్ సీజన్ లో ఐతే దాదాపు 15 వేల మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేశారు. ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేయారు. ఇక కొత్త సీజన్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అమెరికాలో జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్ జరిగాయి అలాగే ఫైనలిస్టులు కూడా రెడీ అయ్యారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా. మనోజ్ఞ బెల్లంకొండ, రిషిత్ గద్దె, శ్రియ నందగిరి, స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రీజ కొఠారు, శ్రీష్టి చిల్లా..వీళ్ళ ఆరుగురు ఫైనల్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యారు. ఇక ఆహా వీళ్ళ పోస్టర్ రిలీజ్ చేసి...ఇండియా ఇక నీ టర్న్..ఆడిషన్స్ జరుగుతున్నాయి. రెజిస్ట్రేషన్స్ చేసుకోండి అంటూ కోరింది.