English | Telugu
Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్ళికి కాంచనని ఆహ్వనించిన సుమిత్ర, దశరథ్!
Updated : Jul 15, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -409 లో......కార్తీక్ తన తాత మాటలకి కోపంగా.. ఈయన ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని దీప బైక్ ఆపమని చెప్తుంది. కార్తీక్ మూడ్ ని డైవర్ట్ చేయాలనీ ట్రై చేస్తుంది. మా బావ చాలా అందంగా ఉంటాడు. వెళ్ళాక దిష్టి తియ్యాలని దీప అంటుంది. దీప ఎలాగోలా కార్తీక్ ని కూల్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తుంది.
మరొక వైపు జ్యోత్స్న దగ్గరికి గౌతమ్ వస్తాడు. జ్యోత్స్న చెయ్ పట్టుకుంటాడు. కింద తాతయ్య ఉన్నాడని జ్యోత్స్న అనగానే తనే పంపించాడు ప్రైవేట్ గా మాట్లాడాలని చెప్పాను. వెళ్ళు మాట్లాడమన్నాడని గౌతమ్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతూ పారిజాతానికి అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేస్తుంది. అది చూసి పారిజాతం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. ఇంకా గ్రానీ రాదేంటని పారిజాతానికి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. గౌతమ్ వచ్చాడు వాళ్లకు ప్రైవసీ ఇవ్వమని శివన్నారాయణ అంటాడు. అంటే కాఫీ ఇచ్చి వస్తానని పారిజాతం గౌతమ్, జ్యోత్స్నల దగ్గరికి వెళ్తుంది. పారిజాతం రాగానే గౌతమ్ జ్యోత్స్న చెయ్ వదిలేస్తాడు.. బాబు కాఫీ తీసుకొని వచ్చానని పారిజాతం తన మాటలతో గౌతమ్ ని భయపెట్టి పంపిస్తుంది. ఎందుకు ఇంత లేట్ గా వచ్చావని పారిజాతాన్ని కోప్పడుతుంది జ్యోత్స్న.
మరొకవైపు సుమిత్ర, దశరథ్ కాంచనని ఎంగేజ్ మెంట్ కి పిల్వడానికి వస్తారు. సుమిత్ర కాంచన ఇద్దరు ఎమోషనల్ అవుతారు. అప్పడే దీప, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. దీప కాఫీ తీసుకొని రా అని కాంచన అంటుంది. అనసూయతో దీప కాఫీ పంపిస్తుంది. ఎందుకు దీప రాలేదని కాంచన అడుగగా.. సుమిత్ర గారు దీప చేత్తో కాఫీ ఇస్తే తాగరని అనసూయ అంటుంది. ఆ తర్వాత కాంచన దీపని పిలిచి మా వదినకి కాఫీ ఇవ్వమని చెప్తుంది. దీప కాఫీ ఇస్తుంటే అక్కడ పెట్టమని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత దశరథ్ సుమిత్ర ఇద్దరు కాంచనకి బట్టలు పెట్టి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.