ఆ అమ్మాయితో డేట్ కూడా చేశా...
ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో కండల వీరులే ఎక్కువగా కనిపించారు. బిగ్ బాస్ 7 కి వెళ్లి వచ్చిన గౌతమ్, యావర్, ఆదర్శ్, రమణ వంటి వాళ్ళు వచ్చారు అలాగే ఫుడ్ లవర్స్, ఫుడ్ వ్లాగర్స్ కూడా వచ్చారు..టేస్టీ తేజ, కుమారి ఆంటీ, పంచ్ ప్రసాద్ వంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐతే గౌతమ్ కృష్ణ తాను ఎందుకు అంత ఫిట్ గా ఉన్నదీ చెప్పుకొచ్చాడు. "నా కాలేజ్ ఏజ్ లో నేను 96 కేజీస్ ఉండేవాడిని. నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉండేది. ఆమెకు ప్రపోజ్ చేద్దామనుకుని అనుకునేవాడిని కానీ కాన్ఫిడెన్స్ లేక నాలో నేను మధన పడి ఆగిపోయేవాడిని. అలా జరుగుతున్నా టైములో ఒక రోజు నా ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్పాడు.