బిగ్ బాస్ లోకి వీళ్ళు దాదాపు కంఫర్మ్ ఐనట్టే ?
బిగ్ బాస్ సీజన్ 9 కి అంతా సిద్ధమవుతోంది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు వీళ్ళు అంటూ చాలా మంది నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ వాళ్ళ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఐతే ఇప్పటివరకు సింగర్ శ్రీతేజ, డైరెక్టర్ పరమేశ్వర్, చిట్టి పికిల్స్ రమ్య, యూట్యూబ్ ఇన్ఫ్లూఎన్సర్ బబ్లు వీళ్ళు ఫైనల్ అయ్యారంటూ తెలుస్తోంది. ఇక నవ్య స్వామి, వర్షిణి, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, హీరో రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ తెలుస్తోంది. సింగర్ శ్రీతేజ ఎక్కువగా పోడ్ క్యాస్ట్స్ చేస్తూ ఉంటారు.