English | Telugu

Brahmamudi:  రాజ్ సపోర్ట్ తో విడుదలైన అప్పు.. యామినికి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-779లో.. మీ అమ్మకు యాక్సిడెంట్ అయ్యింది. త్వరగా రండి అని శ్రీనుకి రాజ్ అబద్దం చెప్పడంతో.. రంగా నుంచి తప్పించుకోవడానికి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటాడు శ్రీను. నువ్వు ఇప్పుడు వెళ్లడం కుదరదని రంగా ఎంత చెప్పినా శ్రీను వినడు. మా అమ్మని చూడాల్సిందే.. మీరు ఇచ్చే డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదని అంటాడు. దాంతో నిన్ను అని శ్రీను మీద చెయ్యి ఎత్తుతాడు రంగా. మన రాజ్ వచ్చేస్తాడు. ఆ చేతినే పట్టుకుంటాడు. రాజ్‌ని చూడగానే శ్రీను.. చూడన్నా వీళ్లు నన్ను పోనివ్వడం లేదని అంటాడు. నేను తీసుకెళ్తాగా కాసేపు ఆగు అని రాజ్ అంటాడు. ఆ తర్వాత శ్రీను తీసుకుని వెళ్ళి కారు ఎక్కించుకుంటాడు రాజ్. ఇక రాజ్.. అదే సమయంలో సర్ అని గట్టిగా అరుస్తాడు శ్రీను. అప్పటికే రంగా లావుపాటి కర్రతో రాజ్ తలపై కొట్టేస్తాడు. ఆ దెబ్బకు రాజ్ తల పట్టుకుని వెనక్కి తిరిగి రంగాని చూసి కోపంగా వాడ్ని పట్టుకోబోతాడు. కానీ రాజ్ క్షణాల్లో తీవ్రమైన నొప్పితో అక్కడే కారు దగ్గర కూలబడిపోతాడు. మరోవైపు కోర్టులో వాదోపవాదాలు అన్నీ అప్పూకి వ్యతిరేకంగానే నడుస్తాయి. యామిని సంబరపడుతుంటుంది. కావ్యకు తన చూపులతో, సైగలతో చుక్కలు చూపిస్తుంటుంది యామిని. అప్పూ లంచం తీసుకోవడంతో పాటు శ్రీనుని అప్పూనే మాయం చేసిందని జడ్జ్ కేసుకి శిక్ష ఖరారు చేస్తుండగా.. శ్రీను, శేషు గారిని తీసుకుని రాజ్ కోర్టుకి ఎంట్రీ ఇస్తాడు.

శ్రీనుని తీసుకుని వచ్చిన రాజ్.. యువరానర్ ఇతడే కేసు పెట్టిన శ్రీను.. ఏం జరిగిందో మొత్తం ఇతడే చెప్తాడు. ఇతడి మాటలు ఒక్కసారి వినండి అని రాజ్ అంటాడు. దాంతో కావ్య, అప్పూ, కవిలకు చెప్పలేనంత ఆనందం వస్తుంది. ఇక జడ్జ్ ఆదేశాల మేరకు.. బోనులోకి వస్తాడు శ్రీను. తన స్నేహితుడితో కలిసి అప్పూని ఎలా మోసం చేశాడో వివరిస్తాడు శ్రీను. ఇదంతా కావాలనే చేశాను సర్.. దానికి కారణం అని చెప్తాడు. నాకు ఒక మేడమ్ ఫోన్ చేసి ఇదంతా చెయ్యమంది. డబ్బు ఇస్తే ఇదంతా చేశాను.. తప్పు నాదే.. కానీ ఆ మేడమ్ ఎవరో నాకు తెలియదని శ్రీను చెప్తాడు. దాంతొ కోర్టు అప్పుని నిర్ధోషిగా విడుదల చేసి, శ్రీనుకి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తుంది. ఇక అప్పూ దోషి కాదని తేలడంతో కావ్య, కవి అంతా నవ్వుతారు. కానీ రాజ్ మాత్రం ఓ నవ్వు నవ్వుతాడు.

ఇక కోర్టు తీర్పు తర్వాత.. రాజ్, కావ్య, కవి దగ్గరకు వచ్చిన అప్పు చాలా సంతోషిస్తుంది. అక్కడే ఉన్న యామిని రగిలిపోతుంది. అప్పుడే రాజ్‌కి కళ్యాణ్, అప్పు ఇద్దరు థాంక్స్ చెప్తారు. అన్నయ్యా నీకు నేను రుణపడిపోయా అని కళ్యాణ్ అంటాడు. మరి అనుక్షణం రాముడి వెంట లక్షణుడిలా నా రుణం తీర్చుకో తమ్ముడు అని రాజ్ అంటాడు. అలాగే అగ్రజా అని కళ్యాణ్ అంటాడు. దాంతో వాళ్లు నలుగురు నవ్వుకుంటారు. వెంటనే అలిగినట్లు కావ్యవైపు రాజ్ చూసి.. అంతా థాంక్స్ చెప్పారు చెప్పాల్సిన వాళ్లు చెప్పలేదని అంటాడు. కావ్యకు అర్థమై పట్టించుకోనట్లుగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.