English | Telugu
కుమారి ఆంటీ జీవితంలో ఇన్ని కష్టాలా...
Updated : Jul 22, 2025
సోషల్ మీడియా పుణ్యమా అంటూ గతంలో హైదరాబాద్ లో ఉండే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే కుమారి ఆంటీ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాంటి కుమారి ఆంటీ లైఫ్ లో కూడా ఎన్నో ఖాతాలు ఉన్నాయి. రీసెంట్ గా ఆమె ఫామిలీ స్టార్స్ షోలో తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని చెప్పుకొచ్చింది. "మా ఇంట్లో ముగ్గురం సంతానం. అక్క, అన్నయ్య, నేను. అక్క చదువుకుంది. అన్నయ్య ఇంజనీర్. ఫస్ట్ టైం అన్నయ్యను అమెరికా తీసుకువెళతాను అని డబ్బులు కట్టమన్నాడు. అలా అన్నయ్య ఒక రోజు డబ్బులు కట్టడానికి వెళ్తుండగా రోడ్ ఆక్సిడెంట్ అయ్యింది. రెండు కాళ్ళు, నడుము పోయాయి. డబ్బులు ఎవరో కొట్టేశారు. ఐతే అన్నయ్య అమెరికా వెళ్ళడానికి చాలా మంది డబ్బు సాయం చేశారు. అప్పు కూడా ఇచ్చారు. అన్నయ్యకు ఇక జాబ్ లేదు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. డబ్బులు ఎలా ఇవ్వాలో తెలీదు. అన్నయ్యకు ఎం చేయాలో తెలీలేదు. ఆ టైములో అన్నయ్య చనిపోదామని కూడా అనుకున్నాడు. నిజంగా ఏ ఇంటికైనా సరే అమ్మ ధైర్యం, నాన్న, అన్నయ్య ఇలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు నేను చెప్పా ఈరోజు చనిపోతాము. కానీ వేరే వాళ్ళు మన కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును అప్పుగా ఇచ్చారు.
ఆ అప్పు తీర్చకపోతే వాళ్ళెంత బాధపడతారో ఒకసారి ఆలోచించు అని చెప్పాను. ఎన్నేళ్లకైనా కస్టపడి అప్పు తీరుద్దాం అంతేకాని చనిపోతాం అనే ఆలోచన పెట్టుకోవద్దని చెప్పి కలిసికట్టుగా నడిచాము. అలా ఆ అప్పులన్నీ తీర్చేసాము. మా ఆయన నన్ను ఇష్టపడి చేసుకున్నారు. మా అత్తమామలు కట్నం కూడా తీసుకోలేదు. ఆస్తి కాదు ముఖ్యం ప్రేమ అన్నారు వాళ్ళు. అలా ఆ ప్రేమే ఈరోజు నన్ను మీ అందరి హృదయాల్లో నిలబెట్టింది." అంటూ కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. హోస్ట్ సుధీర్ ఐతే "మీరు మంచి రెస్టారెంట్ కూడా పెట్టుకోవాలి" అంటూ విష్ చేసాడు.