English | Telugu

ఇది సుధీర్ సర్కారా ? సుధీర్ స్వయంవరమా ?


సర్కార్ సీజన్ 5 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కత్తిలాంటి అమ్మాయిలంతా వచ్చారు. అందులోనూ బ్రహ్మముడి హీరోయిన్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు వచ్చింది. రాగానే హోస్ట్ సుధీర్ ని పడేసింది. స్టెప్పులేసింది. "మీకు ఈ రోజు అమ్మాయిలే కావాలా ? ఇది సుధీర్ సర్కారా ? సుధీర్ స్వయంవరమా ? కత్తిలా ఉంటారు అమ్మాయిలు అంటారు. కానీ మీరు కత్తిలా ఉన్నారు" అంది దీపికా. "గురువుగారు మరి రెడీ అంటే" అని సుధీర్ అనేసరికి "హా రెడీ అంటే మరి" అని దీపికా రివర్స్ లో అంది. "మీరేంటండి బాబు డాన్స్ చేయడానికి అండి." అన్నాడు సుధీర్. "ఇంకొంచెం దగ్గరకు రండి. గాలి వస్తుంది.

ఎందుకంటే మీరు సుడిగాలి సుధీర్ కదా" అంటూ సుధీర్ మీద జోకులేసింది. ఫ్యూచర్ లో బీచ్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు ? అని సుధీర్ అడిగాడు. దానికి దీపికా నవ్వుతూ "డ్రైవింగ్ తెలిస్తే నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. లేదంటే క్యాబ్ డ్రైవర్ ని బుక్ చేసుకుని వెళ్తాను." అంది. అంతే క్యాబ్ ని బుక్ చేసుకుని అనాలి కానీ క్యాబ్ డ్రైవర్ ని అనకూడదు అంటూ కరెక్ట్ చేసాడు సుధీర్ . "మా అమ్మ నాన్నతో ఎం చెప్పి వచ్చానో తెలుసా" అంది దీపికా. "అమ్మా ఆడి కార్ వద్దు, బిఎండబుల్యు కార్ వద్దు సుధీర్ సర్కార్ కి వెళ్తే చాలు అని చెప్పి వచ్చాను. దీపికా ఈమధ్య చాలా షోస్ లో కనిపిస్తూ ఉంది. డాన్స్ రాకపోయినా ఓంకార్ నిర్వహించిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి మెంటార్ గా వచ్చింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో రెగ్యులర్ గా కనిపిస్తుంది. అలాగే చెఫ్ మంత్ర కుకింగ్ షోకి సమీరా భరద్వాజ్ జోడిగా వచ్చింది. అలాగే ఇప్పుడు సర్కార్ సీజన్ కి వచ్చింది. ఎంతమంది కామెడీ చేసినా దీపికా కామెడీ బిట్స్ మాత్రం బాగా హైలైట్ అవుతూ ఉంటాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.