చంద్రబాబు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టమా ?
సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి "సుందరకాండ" మూవీ టీమ్ రాబోతోంది. ఈ మూవీ టీమ్ లో నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వాసుకి, సునయన, విర్తి వాఘాని వీళ్లంతా వచ్చారు. ఐతే ఈ వీక్ సుమ అడ్డా కాస్తా పొలిటికల్ అడ్డాగా మారింది. ఇందులో కీలకమైన రాపిడ్ ఫైర్ రౌండ్ లో వాసుకుని, నారా రోహిత్ ని కొన్ని ప్రశ్నలు వేసింది సుమ. " మీరు రాఖీ పండగ రోజు రాఖీ ఎవరికీ కడతారు. మీ రియల్ బ్రదర్ కా లేదా తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి" అని అడిగేసరికి వాసుకి షాకైపోయింది. తర్వాత నారా రోహిత్ వచ్చారు. "మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు..చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు" అని అడిగింది సుమ.