English | Telugu

రష్మీకి ఏమయ్యింది ? ఆ పోస్ట్ వెనక అర్ధం ఏంటి ?

జబర్దస్త్ కి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి యాంకర్ ఉన్న రష్మీ గురించి అందరికీ తెలుసు. ఈమె ఈ షోస్ ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటుంది. రీసెంట్ గా జబర్దస్త్ కి రష్మీకి కో-యాంకర్ గా మానస్ వచ్చాడు. మరి రష్మీ విషయంలో ఏమయ్యిందో, ఎం జరగబోతోందో తెలీదు కానీ ఆమె పోస్ట్ చూస్తే ఆమె ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతోందా అనే ప్రశ్న రాకుండా ఉండదు. ఇంతకు ఆ పోస్ట్ లో రష్మీ ఎం చెప్పిందంటే "ఒక నెల రోజుల పాటు నాకు అవసరమైన డిజిటల్ డిటాక్సిఫికేషన్ తీసుకుంటున్నాను..వర్క్ పరంగా అలాగే పర్సనల్ గా కూడా కూడా ఇప్పుడు నాకు ఇది చాలా అవసరం అనుకుంటున్నాను.

ఈ డిజిటల్ మీడియా కారణంగా ఏ విషయాన్ని సరిగా ఆలోచించుకోలేకపోతున్నాను. కానీ నేను ప్రామిస్ చేస్తున్నా డిజిటల్ డీటాక్స్ తర్వాత నేను మరింత స్ట్రాంగ్ గా తయారై మళ్ళీ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పుంజుకుని మరింత బలంగా నేను వస్తాను. నన్ను నేను ఇంకా బాగా ప్రాజెక్ట్ చేసుకోవడానికి నాలోని కొత్త ఎనర్జీని బయటకు తీసుకురావడానికి కొంత సమయం ఇప్పుడు నాకు అవసరం. డిజిటల్ ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉండడంతో నన్ను నేను కోల్పోతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చింది. చాలా విషయాలను నేను సార్ట్ అవుట్ చేసేసాను. ఇక ఇప్పుడు టైం వచ్చింది నేను ఉన్నా లేకపోయినా మీ ప్రేమ, మీ సపోర్ట్ నా మీద ఇంకా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. " అంటూ రష్మీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. రష్మీ - సుధీర్ ఆన్ లైన్ జోడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. తర్వాత సుధీర్ జబర్దస్త్ ని, శ్రీదేవి డ్రామా కంపెనీని వదిలేసి వెళ్ళిపోయాక రష్మీ సింగల్ హ్యాండ్ తో ఈ రెండు షోస్ ని రన్ చేస్తోంది. మరి ఇప్పుడు ఈ పోస్ట్ వెనక అర్ధం ఏంటో చెప్మా అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.