posted on Dec 6, 2013
రమ్మనుచు లక్షిని
నారసింహుని బిలిచి
గొంతెత్తి పాడి నువు
వేడుకొంటివి గదనే
పూజలూ వ్రతములు
నిష్టతో నువు జేయ
ఇష్టముతో దేవతలు
రప్పించుకొనిరేమొ
కష్టమంతయు నాది
పుణ్యమంతయు నీక ?
ఏ జన్మ ఋణమె యిది
నా..... జాబిలమ్మ
వి. బ్రహ్మానంద చారి.