నీహృదయాన్ని అడుగు - సులోచనా దేవి
posted on Jan 11, 2012
నీహృదయాన్ని అడుగు
- సులోచనా దేవి
ఓ మునిమాపు వేళ
బృందావనిలోని వెన్నెలంతా
నీ ముంగిలిలో చిరుజల్లులా
కురుస్తూ -
క్రొత్త లోకాల్లోకి
తీసుకెళ్తుందా -
ఎవరిదో తీయనైన పిలుపు
నీకు పిల్లన గ్రోవిలా
హాయిగా వినిపిస్తుందా -
చల్లని యమునా తటిలో
ఎవరితోనో జంటగా
విహరించాలని ఉందా -
తెలియని తీరాలకు
అలాగే సాగిపోవాలనుందా-
నిన్నదంతా అన్నీ మరచిపోయేట్లు
చేసినదెవరో తెలుసుకోవాలనుందా-
ఇంకెందుకు ఆలస్యం నేస్తం
నీ హృదయాన్నడిగి తెలుసుకో
నీ ప్రియుడి చిరునామా చెప్తుంది.