మౌనవేదం - సామర్ల లక్ష్మి రాజ్
posted on Jan 11, 2012
మౌనవేదం
- సామర్ల లక్ష్మి రాజ్
నీ సమక్షంలో నన్ను నేను మరచి.....
నీ విరహంలో నా వునికినే కోల్పోయి......
తీసే ప్రతి శ్వాసా.....
వేసే ప్రతి అడుగు.....
నా అణువణువు నిండుగా నిండిపోయి......
ప్రతిక్షణం నీకై అలమటించి ఎదురు తెన్నులు చూస్తున్న నేను.....
ఇది ప్రేమని నేను.....
కాదు! భ్రమ అని నువ్వు......
పెదవి విరిచి నన్ను తృణీకరించి మాయమైపోయావు.
నీ జ్ఞాపకాలను దొంతర్లుగా పేర్చి......
మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తం చేసి....
నన్ను నేను సంభాళించుకుని.......
మరొకరి చేయి అందుకున్న వేళ......
ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమై......
నువ్వేకావాలి అంటూ పరితపిస్తే....
అప్పుడు చూడని నీ కళ్ళల్లో.....
ఇప్పుడు తళుక్కుమంది ఆ ప్రేమ!!
ప్రియతమా! ఇది గుర్తుంచుకో-
ఒకప్పుడు నీ ప్రియురాలినే అయినా-
నేడు నేను మరొకరి ఇల్లాలిని!!
అందుకే నీ ప్రశ్నకు....
మౌనమే నా సమాధానం!!