posted on Jul 24, 2013
క్షణమొక దినముగా
వి.బ్రహ్మనంద చారి
క్షణమొక్క దినముగా
దినమొక్క యుగముగా
గడచేను కాలమ్ము
వగచేను ప్రాయమ్ము
అమృతపు ఝరివోలె
అంబరమ్మున జారి
అలవోకగా వచ్చి
అలరారు ముత్యమై
మెరిసిపోదువు రావె
మురిపాల కొమ్మ
మరులు గోల్పగ రావె
నా.... జాబిలమ్మ