posted on Jul 23, 2013
మెరుపులాంటి చూపులు
వి. బ్రహ్మనందచారి
మెరుపులాంటి చూపులు
పగడంపు పెదవులు
శంఖమును బోలు మెడ
బింకమున నుండు యెద
చంద్రబింబపు మోము
మండగామనపు నడుము
పొడవైన వాలు జడ
నాట్యమాడే నడక
నవనీతమైన మది
ననుకోరి చేరినది
మణులు మన్యాలేల
నా....జాబిలమ్మ