అతని పేరు కాళిదాసు
posted on Jun 20, 2013
అతని పేరు కాళిదాసు
శరత్ చంద్రా
అతడు కాళిదాసు
అతని భార్య పేరు కాళి!
అస్తమించే సూర్యుడికి ఎరుపు ఎక్కువ
లోకంలో ఉన్న
దారుణాలను చూసి చూసి!
గుండె నొప్పిఅని
కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్తే
జేబుకు గండిపడింది!
మా కుక్క మా ఇంట్లో తిని
పక్కింట్లో కాపలా కాస్తోంది
ఉన్న ఊరిని వదిలేసి ,
విదేశానికి నేను పని చేస్తున్నట్టుగా!