కడలి తల్లి

కడలి తల్లి - మనోహర్ పోగతేలిన కన్నుల కాంతిలేక కొసలు సాగిన కురులకు నునెలేక మలిన మెరుగని ఎదకప్ప బట్టలేక బిక్కవోయిన మోముతో, దిక్కులేక తిరుగాడుతున్న ఓ చిట్టి తల్లి ఏ తల్లి కడుపు పండిన పంటనీవు? బెదరి చూచెడి నీ చూపు చదువలేక మమత కోరెడు నీ మనసు నర యలేక పట్టేడన్నము పెట్టి నీ బోజ్జనింపలేక పదులు,వందలు,వేలుగా సాగిపోవు ఈ మర మనుష్యుల జన్మలెందుకమ్మ? ఎదుట కన్పించు చిన్నారి దేవత నిన్ను గుర్తించలేక గుళ్ళో గంటకొట్టి ముడుపు చెల్లించు మూర్ఖుల బూజు దులిపి కళ్ళు తెరిపించ నెవరి తరము తల్లి మేధపదు నెక్కి గుండెలు బండబారి బ్రతుకు విలువలు దిగజారి పతనమైన పాడు మనుష్యలమధ్య నీ వుండలేవు రమ్ము,నా శీతల లహరుల నుయ్యాలలూతు నా ప్రేమ సుడులలో నిన్ను పోడువుకొందు  

వినాయకునికో విన్నపం

వినాయకునికో విన్నపం - శారద అశోకవర్ధన్ శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర     ఏరీతి వర్ణింతు నీగుజ్జు రూపంబు     నీచిన్ని తొండంబు నీ మందహాసంబు     నిను దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ     టెంకాయ అరటి పండ్లు పాలు తేనే.     నేతిగారెలు, బూరెలు, బంగారు పళ్ళెంబునందుంచి     నీకు నైవేద్యమున్ బెట్ట.     మది ఉబలాటపడుచుండ     అది ఏమి ఖర్మమో, ఎంత ప్రయత్నించినా     ఏదియున్ చెయ్యలేని నిస్సహాయ స్థితి     నన్నావరించె     చిల్లరెంత కుమ్మరించినా టెంకాయ రాదు     అరటి పండ్లసలె రావు, పాల పాకెట్లు రాకున్న     పాలుండవూ, జలశాఖ వారి దయ లేకున్న     నీళ్ళైన వుండవూ,     తేనెలోనా కల్తీ, నూనెలోనా కల్తీ,     నేనెట్లు నీకిత్తు స్వామీ,     నేతిగారెలున్ చేతమన్న     చచ్చిన జంతువు కొవ్వు కలిసిన నెయ్యి     పిండి కలిపి విక్రయించిన వెన్న     నేనెట్లు నీకిత్తు స్వామీ.     బంగారు పళ్ళెంబు అటులుండ     బంగారు ఉద్దరిణె అయిన తేలేని స్థితి     పరమేశ్వరా ఓ విఘ్నేశ్వరా     నాయందు దయవుంచి, ఈ విఘ్నాలు     తొలగించి, నన్ను మన్నించి     దొంగ వ్యాపారస్తుల పీకలన్ నొక్కి     వారిని శిక్షించుమా మమ్ము రక్షించుమా.         మీ అమ్మ పేరిట అన్నపూర్ణ అనబడే     ఈ భరత ఖండాన, నెయ్యి లేకున్నాగానీ     కష్టమేమీ లేదు నష్టమసలే లేదు     బంగారమూ లేకున్న బాధలేదు     కానీ పట్టెడన్నము లేక పసివారు పస్తుండ     చెత్త కుండీలలోని ఎంగిలాకుల కొరకు కుక్కలతో కుస్తీలు పడుచుండ     చూడలేకున్నాను ఆ బాధ బాపలేకున్నాను     నామీద దయవుంచి నన్ను మన్నించి     నీ చల్లని చూపులన్ మామీద ప్రసరించి     మమ్ము కాపాడవా     మమ్ము రక్షించవా,     ఉన్నదానిలో నినుగొల్చి  ప్రార్ధించు భక్తాళికిన్     కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై సద్భుద్దియు     విద్యయు నొసంగి,     కడుపు నిండా కూడు, తలదాచ నొక గూడు     ప్రసాదించి పోషింపు మంటిన్, కృపన్ గావు     మంటిన్, మహాత్మా, ఈశపుత్రా, పార్వతీ     తనయ ఇవే వందనముల్ శ్రీ గణేశా     నమస్తే, నమస్తే, నమస్తే నమః  

రోజురోజుకీ పెంచేస్తూంటే

రోజురోజుకీ పెంచేస్తూంటే - శారద అశోకవర్ధన్ ' సినిమాలు లేకపోతే మానె చిరుజల్లుకురిస్తే చాలు     అదే పదివేలు'     అని తొలకరి చినుకులకి ఎదురుచూస్తూ వుంటుంది .     మండుటెండని మరిపించే మల్లెపూల పరిమాళాలలో     మామిడి పండ్లలోని మాధుర్యంలో     అలసటా, ఆవేదనలు మరిచిపోయి     రేపటి ఆశలుకోసం వేయి కళ్ళతో     ఎదురు చూస్తూ వుంటుంది     ఎన్ని రేపులు మోపులు మోపులుగా     వెళ్ళిపోతూన్నా అలా వెచ్చి చూస్తూనే వుంటుంది,     నగరంలో నారీమణి     మధ్య తరగతి సుందరీమణి!     బాల్యం, యౌవ్వనం, వృద్ధాప్యం     మనిషిలో మాప్రులు తెచ్చినట్టే     వసంతం, గ్రీష్మం, హేమంతం, శిశిరం     ఋతువులు కూడా కాలంలో మార్పులు తెస్తాయి కద!     ఎండల్లో వేగిపోయి పగుళ్ళు బాసిన పుడమి తల్లిని     చల్లబరుస్తూ చినికి చినికి వానై     వానల్లా మూసురైతే     హాయిగా వుందన్న నారీమణి     బురద గుంటల్లా తయారయిన     విధులని చూసి విసుక్కుంటుంది     శ్రీవారూ పిల్లలూ తడుపు కొచ్చిన     తడి గుడ్డలను చూసి గతుక్కుమంటుంది.     ఉఱుములనీ మెరుపులనీ చూసి     ' ఆకాశం చిల్లు పడలేదు కదా' అని సండేహిస్తుంది     ఇంట్లో వుంటే ఈ తిప్పలు తప్పవని     ఉద్యోగంలో ఎంతో హాయి వుందనీ     తియ్యని కలలు కంటుంది     అవసరమయితే దాని కోసం     విశ్వ ప్రయత్నం చేస్తుంది!     తీరా ఉద్యోగం ఒచ్చిందంటే     ఇంటి పనీ, ఆఫీసు పనీ చేసి     అలిసి పోతున్నానని ఆక్షేపిస్తుంది     ఎండకీ వానకీ గురైపోయి     గుండెచేత బట్టుకుని నిండు బస్సునెక్కి     ఉస్సురని ఇల్లు చేరుకునే ఇంతి     ' ఇంతకంటే ఇంట్లో వుండడమే మేలు '     అనుకుంటుంది, అదే కోరుకుంటుంది.     నగరంలో నడిరోడ్డు మీద సయితం నిర్భయంగా నడవలేని నారీమణి     గాలిని సయితం నగరంలో స్వేచ్చగా పీల్చునోచుకోని అబలామణి     కేవలం ఊహలతోనే ఊపిరి పోసుకుంటుంది     ఊరడిల్లుతుంది!     ఉన్నదానితో రాజీపడలేక పోవడం     లేని దానికోసం ఆరాట పడడం     ఇదే జీవితమంటే     ఆశలతో బతకడమే     జీవించడం అంటే!     ఊహలే లేకపోతే     ఆశలే చచ్చిపోతే     జీవితానికి లేదు అర్ధం     జీవించడం వ్యర్ధం!  

శాపం

శాపం                                                                                                                             - శారద అశోకవర్ధన్ ఎంత ' ఉక్కు' అయినా     మంటల్లో మాడిస్తే     నీరులా జారిపోతుంది!     ఎంత రాతి బండనైనా     సుత్తితో బాదితే     చిత్తుగా పగిలి     ముక్కులు ముక్కలవుతుంది !     ఎంత ఉదృతమైన నదీనదాలు     మానవుడి తెలివి తేటలకు లొంగి     ఆనకట్టలకు ఆగుతున్నాయి!     ఎంతటి భయంకరం కౄర మృగాలవైన     మనిషి మచ్చికతో చేరదీసి     చతురతో లొంగదీసుకుంటున్నాడు!     కడలిలో ఈది భూగర్భ శాస్త్రాన్నీ     అంతరిక్షంలో ఎగిరి ఊర్ద్వలోకాలనీ గాంచి     మనిషి సాధించలేనిదేదీ లేదంటూ     దండోరా వేయిస్తున్నాడు.     భుజాలు చరుచుకుంటున్నాడు.     కానీ     మనిషి మనిషితోనే చిత్తుగా     ఓడిపోతున్నాడు     యుగ యుగాలుగా పాతుకుపోయి     కరుడు గట్టిన మూర్ఖత్వాన్ని     కరిగించలేక పోతున్నాడు     మారేకాలంతో మారుతున్న విలువలతో     మారలేక     జీవితంతో కుస్తీ పడుతూన్న తోటి     మానవులను మార్చలేకపోతున్నాడు.     స్వార్ధమే ఊపిరిగా జీవించే రక్కసులను     జయించి వారి ఆటకట్టించలేక పోతున్నాడు.     నల్లజారు నడివిధుల్లో నాగరికంగా     చలామణీ అయ్యే     గోముఖ వ్యాఘ్రాలను లొంగదీసుకోలేక పోతున్నాడు     సారామత్తులో చిత్తుగా మునిగి     సుఖాల బురఖా కప్పుకుని     పైలా పచ్చీసుగా తిరుగుతూ     పడతుల శీలాలను బలిగొనే     రావణాసురుల నాపలేకపోతున్నాడు.     కులాల పేరిట కుత్తుకలు కోసుకునే     కుళ్ళు సమాజానికి కళ్ళు తెరపలేక పోతున్నాడు.     మతంపేరిట జరిగే హొమపు     మంటలనాపలేక పోతున్నాడు.     పదనీ వ్యామోహాల మురికి గుంటల్లోపడి     బంధావ్యాలను సయితం బలిచేస్తూ     నైతిక విలువలను నట్టేట ముంచుతూన్న జనానికి     బుద్ధి చెప్పలేక పోతున్నాడు.     " నితీ భీతీ న్యాయం ధర్మం'     అనే పదాలు వింటేనే పగలబడి నవ్వి     జాతి ఔన్నత్యాన్ని నట్టేట ముంచుతూన్న     దౌర్భాగ్యుల కీళ్ళు విరవలేక పోతున్నాడు     ఎన్ని సాదిస్తేనేం?     మనిషి మనిషితోనే ఓడిపోతున్నాడు     మనిషి మనిషిగా బతకలేకపోతున్నాడు     రచ్చగెలిగి ఇంట ఓడిపోయినట్టు     మనిషి పెట్టిన అడ్డుగోడలను     మనిషే కూలగోట్టలేక పోతున్నాడు.     అదే నేటి మనిషి ఖర్మం!     మనుగడకి శాపం!  

ఓ కలమా' కాపాడు నన్ను

 ఓ కలమా' కాపాడు నన్ను -శారద అశోకవర్ధన్ ఎందుకో నాకీ వ్యథ?     అంతులేని ఈ జీవన యానంలో     నేను సయితం ఒక సమిధనే కదా!     అతనిపై జరుగుతూన్న అన్యాయాలను చూసి     అవకతవకలను గాంచి     ఆగిపోతుందేమో గుండె అన్నంత ఆవేదన !     ఆపలేని అనర్ధాల అగ్నిగుండాల అన్నంత చూసి అప్పుడే     పగిలి పోతుందేమో గుండె అన్నంత ఆందోళన!     ఒక పక్క పగలంతా రెక్కలు ముక్కలయ్యేలా     పనీ పాటా చేసుకుంటూ     మధ్యాహ్నపు మార్తాండు డి తీవ్రత తప్ప     సాయం సంధ్య సోగాసుల్నీ సముద్రపు హొరుల్నీ     కనీసం విననైనా నోచలేని సామాన్య సోదరుడు     కడుపులో ఆకలికి కర్రుమనే పేగుల చప్పుళ్ళే సంగీతంగా     కష్టాల దొంతరులే నిత్యపారాయణంగా     కుటుంబాన్ని సాకలేని నికృష్టపు జీవితాన్ని గురించి     కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంటే     మరోపక్క తిన్నదగరక తికమకలు పడుకుంటూ     అరగడానికి అందంగా మదులను మింగుకుంటూ     కులాసాల విలాసాల పందిల్లో సంతర్పణలు జరుపుకుంటూ     పీకల నిండా సారానింపి     పేకాటల సరదాల సల్లాపాల్లో తేలియాడుతూ     కాలుకింద పెట్టకుండా కారులోనే కలాపాలు సాగించే     కల్తీ నాగరీకులను చూస్తూ వుంటే     కడుపు తరుక్కుపోయే ఆవేదన     అర్ధంలేని అవ్యక్తమైన అందోళన!     ఎందుకో నాకీ వ్యధ?     అంతులేని ఈ జీవన యానంలో     నేను సయితం ఒక సమిధనే కద!         చదువు పేరు చెప్పుకుంటూ చదివే ఓపికలేక     షార్టు కట్టున ప్యాసవ్యాలనే కొందరు విద్యార్ధులూ     పని చెయ్యకపోయినా ప్రమోషన్ల లిస్టులో     ప్రధముడిగా వుండాలని తహతహలాడే కొందరు ఉద్యోగులూ     బాధ్యతలను విస్మరించి హక్కుల కోసమే     పోరాడే కొందరు యువకులను చూస్తుంటే     మనస్సు విల విల లాడుతుంది     మదిలో విషాదం అలుముకుంటుంది.     ఇదే రేపటి నా తరం     గగుర్పొడుస్తుంది నరనరం.     కట్నాలు చలవనీ అత్తవారిని తిట్టిపోస్తూ     కట్టుకున్న భార్యని అడుగడుగునా దెప్పి పొడుస్తూ     కసితీరక కాల్చి అడుగడుగునా దెప్పి పొడుస్తూ     కసితీరక కాల్చి చంపి, మరోదాన్ని కట్టుకుని     మగధిరుల చూస్తు వుంటే     గుండె నిండా చీకటి నిండిపోతుంది     గుబులుతో మనసు మాడిపోతుంది     ఇదే రేపటి నా తరం     గగుర్పొడుస్తుంది నరనరం!     పదవి కోసం పరువును తాకట్టు బెట్టి     విలువలను నడివీధిలో నగ్నంగా వేలంవేసి     స్వార్ధాన్ని వలువలుగా చుట్టుకుని పెత్తనంచేసే     నాయకుల నడుమ నడుస్తుంటే     నాడు ' వందేమాతరం' నినాదాలతో ప్రజలను ఉత్తేజపరచి     నిస్వార్ధంగా దేశంకోసం వారు చేసిన నాటి త్యాగాలను మనం చేసుకుని     కొన ఊపిరికి ఊహలు నిండి     మధనపడే త్యాగధనులు     ఈనాడు ఇంకా ఎందుకు బతుకున్నామా అని     నిలువునా కుప్ప కూలిపోతూంటే     మనసు వేదనతో మంది పోతుంది     గుండె దుఃఖంతో బద్దలై పోతుంది     అవకతవకలను నేను సరిద్దిలేనపుడు     సమానత్వం ' సౌభ్రాతృత్వం ' అంటూ     ఉపన్యాసాలిచ్చి ఆత్మ వంచన చేసుకోలేను     గేయాలురాసి రాగాలు కట్టి ఆనందించలేదు     అయినా పిరికిని కాను నేను     నిరాశా వాదిని అసలేకాను     అందుకనే అర్ధిస్తున్నాను నా కలాన్ని     ' ఓ కలమా కాపాడు నన్ను' అంటూ     నా ప్రజలను ఉత్తేజపరచే రచనలే సాగించమని!     నా ప్రజలను స్వార్ధపు పొరలనుండి విము క్తిచేసే వినూత్న రచనలు రచించమని!     ఈ మహాయానంలో జీవనసమరంలో     ఏ ఒక్కరు మారినా చాలు అతడే     రేపటి నా తరాన్ని ప్రభావితం చేసే ప్రభాకరుడు     అందుకే నాకీవ్యథ!     అంతులేని ఈ జీవన యానంలో     నేను సయితం ఒక సమిధిగా కలిపోలేను!     రేపటి వెలుగుకోసం ఎదురు చూస్తూ వుంటాను!

జ్ఞాపకం

జ్ఞాపకం - శారద అశోకవర్ధన్ భవిష్యత్తు అనే భవనానికి     వర్తమానం కొన్నిమెట్లు     గతం పునాది రాళ్ళు!     గతం గట్టి అనుభవాల మాలికలైతే     వర్తమానం వాటిలో పరిమళించే పుష్పాలౌతాయి     భవిష్యత్తు దివ్యంగా వెలిగిపోయి స్థిరంగా     నిలిచిపోయే తారక లౌతాయి!     రేపు మనం ఏమవుతామో తెలుసుకునే ముందు     నిన్న మనం ఎలా ఉండాలో తలచుకుంటే మేలు     జ్ఞాపకాలు జీవితానికి వెలుగుచూపే దీపాలు     కావాలి కాని     జీవితాలను కాల్చివేసే నిప్పు కణికలు కాకూడదు!     మనిషిలోని మంచిని పెంచే మార్గదర్శి        కావాలి జ్ఞాపకం!     మనస్సును చంపే 'మాత్ర' మాత్రం కాకూడదు     చిరస్థాయిగా నిలిచిపోయే చిహ్నం కావాలి జ్ఞాపకం     భవిష్యత్తులో బంగారం పండించే బీజం     కావాలి జ్ఞాపకం!  

ఈ లోకం ఇంద్రలోకం కాకపోతుందా

ఈ లోకం ఇంద్రలోకం కాకపోతుందా                                                                                           - శారద అశోకవర్ధన్ ఊరిచివరన ఏరుకావల     ఉన్న దొక్క గున్నమామిడితోట     తోటమధ్యన పెంకుటింట్లో     సరదాగా గడపాలని     సతినీ సంతతినీ వెంటబెట్టుకెళ్లాడు     వెంకటపతి!     చైత్రమాసం పిలుపు వీని     పులకించిపోయే ప్రకృతి కంత విరజిమ్మిన శోభ     మల్లెపూలు, మామిడిపళ్లూ, మలయమారుతపుమాటా     కోకిల పాటా ప్రతిచోటా చూడగానే     ముగ్ధుడై మురిసిపోయాడు     పరిసరాలను తిలకిస్తూ     పులకింతలో తెలిపోయాడు వెంకటపతిరావు.     అతని దృష్టిని ఆకర్షించింది అందమైన ఆదృశ్యం     ఎఆవిచెట్టు పైన గూళ్లుకట్టుకున్న కాకులదండు వైనం!     గుంపులు గుంపులుగా వొస్తాయి,     ఉదయం మొదలు రాత్రివరకు     మిసుగూ విరామమూ లేకుండా ఏవోపన్లు చేస్తూనే వుంటాయి .     కావు కావుమని, కబుర్లు చెప్పుకుంటు     కలిసి కట్టుగా పోతూవుంటాయి.     సాయంత్రంనికి గూడుచేరుకుంటాయి.     ప్రతి రోజూ వెంకటపతి ఈ దృశ్యం చూస్తుంటాడు     కాకుల గుంపులచూసి ముచ్చటపడి పోతుంటాడు!     ఆ గుంపులోంచి వినబడిన కోకిల కూత     కాకులన్నీ అటుకేసి చూశాయా వింత     కూసిన కోకిల ఎగిరి పోయింది.     గూడు ఖాళీ అయిపోయింది.     రావిచెట్టు మీదనుంచి వెళ్లిపోయి     మామిడిచెట్టున మకాం పెట్టి     మత్తుగావగరు చిగురులు తిని కడుపునింపుకుంటోంది కోకిల     దర్జాగా పాడుగంటూ     ప్రకృతితో ఆడుకుంటు మామిడిచెట్టు కొమ్మల్లోనేవుందిపోయింది     రావిచెట్టు నీడకూడా చూడకుంటోంది.     తనే పడగలననే గర్వంతో     చాటుమాటుగా వుంటోంది కోకిలమ్మ     పాటరానీ కాకులంటే చులకనగా చూసింది.     తనే గొప్పదానిలా తన చుట్లూ గిరిగీసుకుంది     ఎవరితోనూ కలవకుండా ఆకులల్లో దాగి పోయింది.     చైత్రమాసం వెళ్ళిపోయి వైశాఖం గారానే     ముదిరిపోయిన మామిడాకులు నోటిలోకి పోకపోగా     ఆకులూ కాయలూ నేలపైకి రాలిపోగా,     గూడులేని కోకిలమ్మ గిజగిజలాడింది     తలదాచగ గూడులేకా చెప్పుకోను తొడు లేక     వలవలమని ఏడ్చింది     ఒంటరిగా వుండలేక నాలుగురితో కలవలేక     పిచ్చేక్కిన కోకిలమ్మ నిట్టూర్పులు విడుస్తూ     ఓపికంతా చచ్చిపోగా తూలినేల రాలింది.     కాకులన్నీ ఒక్కుమ్మడిగా కోకిల చుట్టూ చేరినయ్     వెంకటపతి వెన్నుమీద ఎవరో చరిచినట్టనిపించింది.     బుఱ్ఱలో ఆలోచన మెరుపులా మెరిసింది.     కోకిల గర్వం మాని కాకులతో కలిసుంటే?     తన పాటను కాకులకూ వినిపించీ నేర్నిస్తే?       కాకులూ కోకిలమ్మను తమ గూటితో చేర్చుకుంటే?     తోటంతా హాయి హాయి!     ప్రతినిత్యం చైత్రమాసం!     ప్రతి నిమిషం వసంత ఋతువు!     అంతరాత్మ ఏదో గొణిగింది     అస్పష్టంగా ఆకాశావాణిలా     మనిషి మనిషీ భేదాలు వీడి, హెచ్చు తగ్గులు విస్మరించి     చేయి చేయి కలుపుకుంటే     సమసమాజం రాకపోతుందా?     ఈ లోకం ఇంద్రలోకం కన్న తీసిపోతుందా?     గయలో జ్ఞానం పొందిన బుద్ధిడిలా     వెంకటపతి నవ్వాడు     తృప్తిగా నిట్టూర్చాడు!  

నాకందని నా ప్రపంచం

నాకందని నా ప్రపంచం                                                                                            - రమాదేవి అందంగా, అపురూపంగా ఎవరి ప్రమేయం లేని ఓ చిన్నిప్రపంచాన్ని సృష్టించుకుంటాను కాని....నే పూర్తిగా నా ప్రపంచపు ఏకాంతాన్ని ఆస్వాదించక మునుపే....ఆహ్వానం లేని ఆగమనం శాశ్వతంగా తోడు నిలిచిపోతాడనుకుని నిరాకరించక సర్దుకుపోతాను అంతలో పలకరించాటానికే కాని పక్కనుండటానికి కాదంటూ కదలి పోతాడు... వెళ్ళిపోతాడు తిరిగి చూస్తే కదా నా చిన్ని సామ్రాజ్యం ముక్కచెక్కలుగా.... చిందరవందరగా .... తిరిగి అందంగా కాకపోయినా అవసరానికి తగ్గట్టు పేర్చుకునే లోపు మరో పరిచయం.... మరో అగాధం...  

గుండె గుండెలో నిలుస్తా

గుండె గుండెలో నిలుస్తా                                                                                                               -  శారద అశోకవర్ధన్ వెలుగూ! నీకంత కాంతి          ఎలా కలిగిందో చెబుతావా ?     నాకూ కాస్త పంచి పెడితే     నాలో నింపుకుని     చీకట్లో నికృష్ట జీవితాన్ని గడుపుతూన్న     నిరుపేదల గుడిసెలకు పంపుతాను     వారి కళ్ళూ మెరిసేలాగా వారికో     దారి చూపిస్తాను.     చీకటి గొంగళీ కింద రహస్య క్రీడలు జరిపే     ముసుగు మనుష్యుల గుండెల్లో ప్రవేశిస్తాను     నా కళ్ళు తెరిపిస్తాను వెలుతురిని     చూస్తాను.     పేరు ప్రతిష్టలను డబ్బుతో కొనే పెద్ద మనుష్యులూ     సొంత లాభం కోసం వెర్రివాణ్ణి పెద్దవాణ్ణి చేసి     వెనకగా నవ్వుకునే దుర్మార్గులూ, దేశం పేరిట     పొట్ట నింపుకోవడమే కాదు     దేశాన్నే మింగేసే బకాసురులు     తరతరాలు గుర్తుంచుకునేలా  గుణపాఠం నేర్పిస్తాను     వెలుగూ! నీ కాంతి కొంత నాకిచ్చావంటే     మూలమూలల ప్రవేశించి, వాకిట్లో, ఇంట్లో గుండెల్లో     అంతరాంతరాల్లో దాక్కున్న చీకటిని     కూకటి వేళ్ళతో పెకలించి తరిమి తరిమి కొడతాను     గుండె గుండెల్లో నేనే వెలుగై నిలుస్తాను.

ఆత్మాలోచనం

ఆత్మాలోచనం                                                                                                           - శారదా అశోకవర్ధన్     కడలిలో జీవనానికి కావలసినవన్నీ  వున్నాయి. మనిషి అవసరాలలో  అతిముఖ్యమైన లవణం దగ్గరి నుంచి,ఆహారానికి పనికొచ్చే  చేపలూ, ఎండ్రకాయలూమాత్రమే కాక, ఆడంబరాలకూ, అలంకరణలకూ  పనికొచ్చే ఆల్చిప్పలూ, ముత్యాలూ కూడా ఈ కడలిలోనే  దొరుకుతాయి!     అయితే ఆ కడలిలోనే భయంకరమైన మొసళ్ళూ, తిమింగిలాలూ, సుడిగుండాలూ కూడా వుంటాయి. అన్నింటినీ గుట్టుగా తన గర్భంలోనే దాచుకుని గంభీరంగా నిరంతర ప్రయాణం సాగిస్తూనే వుంటుంది సాగరం!     కాలం కూడా అంతే! జీవితమూ అంతే!     కాలానికీ, జీవితానికీ మధ్య ఎన్నో తీపి గుర్తులు!     ఎన్నో మధుర స్మృతులు!     ఎన్నో విషాద గాథలు!     ఎన్నెన్నో కన్నీటి కధలు!     సముద్రం సత్యం!     కాలం నిత్యం!     జీవితం అనంతం!     కాలమనే కడలిని తరిచి చూసి పరిశోధించి గమ్యాన్ని చేరుకోవడం మానవుని దృక్పధం! కాలం కడలిలో పయనించడం, సముద్రంలో ఈత కొట్టడం!! పదండి పోదాం!....

మనిషిగా బ్రతకడం

మనిషిగా బ్రతకడం                                                                                                           -శారద అశోకవర్ధన్ మనిషీ! మనిషిగా బ్రతకడం నేర్చుకో     దుర్గుణాల మలినాలను దూరంగా ఒదిలేసి     మంచిని పెంచు మార్గాలను     అనుసరించడం అలవరుచుకో.         జీవితం ఒక గులాబీ     ఆహ్లాదాన్నిస్తుంది     గులాబీల సౌందర్యం     అందాన్నిస్తుంది     జీవితపు సౌరభ్యం.     రెక్కలు రాలిపోతే     అంధవికార మౌతుంది గులాబి     క్రమశిక్షణ లేకపోతే     అర్ధవిహీన మౌతుంది జీవితం.     అందంగా కనిపించే గులాబీకి     ఎన్నో ముళ్ళు!!     తియ్యగా కనిపించే జీవితం వెనకాల     ఎన్నెన్నో చీకట్లు!!       ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీలు కోసుకోవాలి     చీకట్లు చిమ్మకుండా     జీవితాన్ని దిద్దుకోవాలి      అందుకు.     నేర్పూ ఓర్పూ కావాలి     మంచీ చెడూ తెలియాలి     అప్పుడే మనిషిగా మనగలుతావు.     మనిషిలోని కలుషితాన్ని     మంచితనంతో కడిగేసి     అద్దంలోని ప్రతిబింబంలా     నిన్ను నీవు చూచుకో     అప్పుడే మనిషిగా మనగలుగుతావు.     అహంకారపు పొరలు     కనుల కడ్డంగా నిలిచినప్పుడు     మెదడు నువయోగించి     పొరలు తొలగించి     కనుపాపల్లో దాగివున్న సత్యాన్ని చూడు     అప్పుడే మనిషిగా మనగలుగుతావు     పదవీ వ్యామోహంలో     పలుకుబడి కౌగిట్లో     నిన్ను నీవు మరిస్తే     కాలమనే చక్రంలో     అది క్షణికమని తెలుసుకో     వీదారిని మలుపుకో     అప్పుడే మనిషిగా మనగలుగుతావు.     మనిషిగా పుట్టిన నీవు     మానవత్వాన్ని విడచే     దానపుడిలా, దారుణంగా     జీవించడం కన్న     హంసలా, ఆరునెల్లు చాలు మనిషీ     మనిషీగా బ్రతకడం నేర్చుకో                    

నగరం - నారీమణుల ఊహలు

నగరం - నారీమణుల ఊహలు                                                                                                                      శ్రీమతి శారద అశోకవర్ధన్   నగరంలో నారీమణి     ఇరుగుతోటీ పొరుగుతోటీ     అయిన వాళ్ళెవరితోటీ     కబుర్లతో కాలాన్ని     కాస్సేపయినా గడపలేని     యంత్రంలాంటి పూబోణి     నగరంలో నారీమణి!     నాలుగింటికి తెల్లారు ఝామునే లేచినా     నాలుగు బిందెలు నీళ్ళు పడని పంపుతో     తలకొట్టుకుంటూ     నడిరాత్రివరకూ నడుంవిరిగేలా     అన్ని పనులూ తనే చేసుకుంటూ     ఒకపక్క శ్రీవారు సకాలానికి ఆఫీసు కెళ్ళాడానికి     ఏర్పాట్లలో సతమతమైపోతూ     నలిగిపోయే నగరంలోని లలనామణి నారీమణి!     వేసవికాలం ఎప్పుడొస్తుందా     కనీసం పిల్లలకైనా సెలవులొస్తే     కాస్త రద్దీ తగ్గుతుందనీ     కొద్ది విరామం దొరుకుతుందనీ     శ్రీవారిని ఒప్పించి సెలవు పెట్టిస్తే     నాలుగు ఊళ్ళూ తిరిగి రావొచ్చని ఉవ్విళ్ళూరుతూ     ఊహలో తేలిపోతుంది రమణీమణి     ఆ వేసవి కాలం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది     వేసవిలో కొత్త సమస్యలు కొల్లలు!కోకొల్లలు!     ఆవకాయ పెట్టనిదే అసలు బయలుదేరడమెట్లా?     అందుకని ముందుగానే సరుకులకోసం అంగడికెళితే     ఆకాశాన్నంటుకునే ధరలు దాచుకున్న డబ్బంతా అక్కడే దోచేసి     అసలు ప్రయాణానికి చిల్లిగవ్వ మిగలకుండా     చేసేస్తాయ్ ! అప్పుల్లో ముంచేస్తాయ్!     ప్రయాణం లేకపోయినా     ప్రాణప్రదమైన కొత్త ఆవకాయ పెట్టుకున్నందుకు     కొండంత పొంగిపోతూ,     ' పిల్లలతో సినిమాలు చూసి గడిపెయ్యోచ్చులే ' అని     అతని తాను ఊరడించుకుంటుంది     ఊహలలో విహరిస్తుంది!     కానీ, సెలవులకోసం ఆశగా ఎదురుచూస్తూంటుంది     పొద్దుపొడిచింది మొదలు     పొద్దు పోయేదాకా     పట్టెడు మెతుకుల కోసం     గుక్కెడు నీళ్ళకోసం గుద్దులాటలతో     దెబ్బలాటలతో సరిపోతూంటే     దానికి తోడు దినకరుడు తన ధాటిని