' పూర్ణమ్మ' లు కాకండి
posted on Sep 5, 2013
' పూర్ణమ్మ' లు కాకండి
-శారద అశోకవర్ధన్
నాడు కన్యాశుల్కం కాలనాగై కాటేసింది
నేడు వరకట్నం విషపుగాలులు గుప్పుతోంది
పేరు మారిందే గాని మారలేదు పరిస్థితి
అదేంఖర్మో అప్పుడూ ఇప్పుడూ ఆడదానికి గోదారే గతి!
ఈ సమస్య పోయేదెలాగా?
డబ్బుకీ పెళ్ళికీ లంకె తెగేదెలాగా ?
ఆడవాళ్ళూ బలిపశువుల్లా పడి వుండకండి
నిండు జీవితాలు బుగ్గిపాలు చెయ్యకండి
పెళ్లంటే కాదు వ్యాపారమని చాటి చెప్పండి
చదువుకున్న వనితలూ మీరు కూడా
' పూర్ణమ్మలు' కాకండీ!