Publish Date:Feb 27, 2026
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య ఘర్షణలు మరోసారి భగ్గు మంటున్నాయి. ఆఫ్గాన్ చేసిన దాడులకు ప్రతిగా పాక్ గజబ్ లిక్ హక్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. కాబుల్, కాందహార్, పక్తియాల్లోని పలు నగరాలపై వైమానిక దాడులు చేపట్టింది. దాంతో రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో సూసైడ్ స్క్వాడ్ అంటూ ఆఫ్గాన్ మీడియా విడుదల చేసిన చిత్రం ఆందోళన రేపుతోంది. ఆ చిత్రాన్ని షేర్ చేసిన బక్తర్ న్యూస్ ఏజెన్సీ వారంతా సూసైడ్ బాంబర్ల బెటాలియన్ అని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.
వారంతా పేలుడు పదార్ధాలు అమర్చిన దుస్తులు, కారు బాంబులతో పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రాంతాలు టార్గెట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించింది. గురువారం పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్గాన్ దాడులు చేయడంతో తాజా ఘర్షణలు చెలరేగాయి. తాము చేసింది ప్రతీకారదాడులే అని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఆ వెంటనే పాక్ యుద్దాన్ని ప్రకటించింది. తమ దాడుల్లో 130 మంది ఆఫ్గాన్ ఫైటర్లు చనిపోయినట్లు పాక్ వెల్లడించింది. మరోవైపు 50 పాక్ సైనికులు మరణించారని ఆఫ్టాన్ ప్రకటించుకుంది. ఇక రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఇరాన్ ముందుకొచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/war-between-pak-and-afghanisthan-attacks-36-214773.html
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.