సీఎం రేవంత్ తో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతల భేటీ

Publish Date:Feb 27, 2026

Advertisement

జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో ముఖ్యమంత్రి ఎ .రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు . ఈ సందర్భంగా వారి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి వారితో సుదీర్ఘంగా ముఖాముఖి చర్చించారు. హింస వల్ల ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదని, ప్రజల ఆకాంక్షలు కేవలం ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో అన్నారు. దశాబ్దాల పాటు అడవుల్లో గడిపిన వారు తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో వెనక్కి రావడం అభినందనీయమని పేర్కొంటూ, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ, పునరావాస కల్పనలో ఎటువంటి లోటు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పునరావాస విధానాలను పరిగణనలోకి తీసుకుని, సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చిన వారికి మరింత మెరుగైన ప్యాకేజీని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,  కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి. శివధర్ రెడ్డి , ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్ , ఎస్.ఐ.బి (ఇంటెలిజెన్స్) ఐజిపి బి. సుమతి తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో మావోయిస్టుల పునరావాస పురోగతిని ముఖ్యమంత్రికి వివరిస్తూ, గత రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 591 మంది మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలిసి సాధారణ పౌరులుగా జీవిస్తున్నారని డిజిపి బి.శివధర్ రెడ్డి తెలిపారు. పోలీసు శాఖ సమన్వయ కృషి, ప్రభుత్వం అమలు చేస్తున్న మెరుగైన పునరావాస విధానాల వల్ల అగ్రనేతల్లో సైతం మార్పు వచ్చిందని  వివరించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు , పొలిట్ బ్యూరో సభ్యుడు  తిపిరి తిరుపతి అలియాస్ దేవుజీ అలియాస్ రమేష్ అలియాస్ సంజీవ్ అలియాస్ చేతన్ అలియాస్ కుమ్మ దాదా (సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్), మాజీ సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న అలియాస్ సోమన్న, పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనాబాయి అలియాస్ మైనక్క అలియాస్ సుజాతలతో పాటు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు  బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), నూనే నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రాహుల్ అలియాస్ సన్ను ఉన్నారు. సాయుధ పోరాటాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అవకాశం కల్పించినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో వారు చేసిన విజ్ఞప్తులకు సానుకూల పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

By
en-us Political News

  
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.