ఫ్రిడ్జ్ పేలి ఇద్దరి దుర్మరణం

Publish Date:Apr 5, 2026

Advertisement

 

తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఉన్న ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న విజయ్ మరియు మరో మహిళ మంటల్లో చిక్కుకున్నారు. వారు గట్టిగా అర్తనాదాలు చేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించారు.

మంటలు తీవ్రంగా వ్యాపిస్తూ దట్టమైన పొగలు బయటకు రావడంతో, స్థానికులు ఇద్దరినీ బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫ్రిడ్జ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

By
en-us Political News

  
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంత‌టా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట‌ వినిపిస్తోన్న మాట‌.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ విడుదల చేసిన జాబితాలో డెల్‌తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌కు గూఢచారి సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.