డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ తారామతి బారాదరి రిసార్ట్‌లో జరిగిన పార్టీపై ఈగిల్ ఫోర్స్ ఆకస్మిక దాడి నిర్వహించామని ఈగిల్ టీం అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలి పారు.నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లోని తారామతి బారాదరి రిసార్ట్‌లో నిర్వహించిన ప్రత్యేక పార్టీపై ఈగిల్ ఫోర్స్ బృందం సోదాలు చేపట్టామని తెలిపారు “More Than Friends” పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ఈ పార్టీని నిర్వహించినట్లు గుర్తించామని ఈగిల్ టీం అధికారులు వెల్లడించారు.
డ్రగ్స్ తీసుకుని పార్టీకి హాజరైనట్లు గుర్తించిన వారిలో ముంబైకి చెందిన నటుడు& మోడల్ సర్వర్ ప్రధానంగా ఉన్నాడు. అతడితో పాటు ప్రముఖ డీజే జాన్సన్ తో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు.. ఈ పార్టీకి ప్రముఖ ముంబై మరియు టాలీవుడ్ సినీ వర్గాలకు చెందిన పలువురు హాజరయ్యారు. ఈ పార్టీలో అనుమానం ఉన్న 35 మందికి డ్రగ్స్ టెస్టులు చేశాం... అందులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.. దీంతో నటుడు సర్వర్, స్పైసెస్ వ్యాపారి నీహార్, వ్యాపారవేత్త నీహర్ భార్య ఆశి, డీజే జాన్సన్, వ్యాపారవేత్త యోగేశ్వర్, ఫార్మాస్యూటికల్ అనలిస్ట్ అవినాష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు... వీరంతా డ్రెస్ తీసుకున్నట్లుగా అంగీకరించారు..వారిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశాము డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతుంది.డ్రగ్స్ వినియోగంపై మరింత సమాచారం సేకరిస్తున్నా మని... హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-taramati-resort-drug-raid-36-216727.html
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.