ఐపీఎల్ 2026 సీజన్ లో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైపై ఆదివారం (ఏప్రిల్ 5) జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. మ్యాచ్ ఆద్యంతం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ లో టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు. ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ పాతిక బంతుల్లో బంతుల్లో 70 నాటౌట్ తో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ స్కోరులో మూడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే టిమ్ డేవిడ్ విధ్వంసం ఏ రీతిలో సాగిందో అర్ధమౌతుంది. 251 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ పాతిక బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rcb-grand-victory-36-216731.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.