రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : సీఎం రేవంత్‌

Publish Date:Mar 19, 2026

Advertisement

 

ఉగాది కొత్త సంవత్సరంలో వాణిజ్యం, పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు. రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కొత్త బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతు..“ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరమని వెల్లడించారు.

 

 

తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే మా లక్ష్యమని తెలిపారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నామని. రైతుల రుణభారం అత్యల్పంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. అందుకే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని పేర్కొన్నారు. 

 

 


రైతుభరోసా కోసం ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని రేవంత్ అన్నారు. ఈ నెల 22న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నాం.రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. ధరణి సమస్యలను పరిష్కరించి భూభారతి ద్వారా భూసమస్యలకు ముగింపు పలుకుతున్నామని పేర్కొన్నరు. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెట్టడమే మా లక్ష్యం. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


 

By
en-us Political News

  
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.