ఆగని ట్రంప్ దూకుడు... 15 శాతానికి సుంకాలు పెంపు

Publish Date:Feb 21, 2026

Advertisement

టారిఫ్‌ల విషయంలో సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గలేదు.   ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్డు చెప్పిన   గంటల వ్యవధిలోనే  ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వచ్చిన గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకాలు విధించిన ఆయన..  తాజాగా వాటిని 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఆ మేరకు సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. సుప్రీంకోర్డు తీర్పు క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మున్ముందూ చట్టబద్దమైన టారిఫ్‌లు అమలు చేస్తామన్నారు.  గతంలో తీసుకున్న దానికంటే ఎక్కువ టారిఫ్‌లు విధించేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటామని పేర్కొన్న ఆయన.. తాజాగా వాటిని 15 శాతానికి పెంచడం చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది.
హైద‌రాబాద్ రాయ‌దుర్గం పీఎస్ ప‌రిధిలో చిత్ర‌పురి కాల‌నీలో ఒక విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ సూట్‌కేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరపైకి వచ్చింది.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు ప్రజాదరణ పొందుతున్నాయి.
స్వీడన్ దేశంలో స్టార్టప్‌ కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తకు అక్కడ చేదు అనుభవం మిగిలింది.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.