కోహ్లీతో వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యను రేప్ చేస్తామంటూ నెట్టింట బెదరింపులు!

Publish Date:May 25, 2026

Advertisement

మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే వాగ్వాదాలు, చోటు చేసుకునే ఆవేశకావేశాలు ఒక్కోసారి సోషల్ మీడియాలో తీవ్ర రూపం దాలుస్తుంటాయి.  తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్  ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ వివాదం చల్లారకపోగా, కొంతమంది   ఆకతాయిలు ట్రావిస్ హెడ్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతోంది. హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన కామెంట్లు, అత్యాచార బెదరింపులకు కొందరు నెటిజనులు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా  విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ఇరువురి మధ్యా ఆవేశాలు తగ్గలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు.  ఈ సంఘటనను పురస్కరించుకుని కొందరు నెటిజనులు.. వారు కోహ్లీ అభిమానులుగా అంతా భావిస్తున్నారు. ట్రావిస్ హెడ్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలతో పాటు అతడి భార్య జెస్సికా ఇన్‌స్టాగ్రామ్ పేజీని సైతం వదలకుండా దారుణమైన కామెంట్లతో దాడికి దిగారు.

ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోల కింద కొందరు వ్యక్తులు అత్యంత హేయమైన భాషను ఉపయోగించారు. మహిళ అని కూడా చూడకుండా ఆమె అత్యాచారం చేస్తామంటూ బెదరింపులకు దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   క్రీడా స్ఫూర్తికే మచ్చ తెచ్చేలా వారి తీరు ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  గతంలో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌పై విజయం సాధించినప్పుడు లేదా భారత ఆటగాళ్లతో వివాదాలు ఉన్నప్పుడు వారి కుటుంబాలను టార్గెట్ చేయడం చూశాం. ఇప్పుడు మరోసారి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పేరిట కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ తరహా వికృత చేష్టలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఈ తరహా ఆన్‌లైన్ వేధింపులు కేవలం ఒక క్రీడాకారుడి కుటుంబ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, అంతర్జాతీయంగా భారత క్రీడాభిమానుల ప్రతిష్టను కూడా దిగజార్చేలా ఉన్నాయని క్రిడీ విశ్లేషకులు అంటున్నారు.  మ్యాచ్‌లలో గెలుపోటములు, స్లెడ్జింగ్‌లు సర్వసాధారణమని..  వాటిని కేవలం మైదానానికే పరిమితం చేయాలని మెజారిటీ క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.   

By
en-us Political News

  
పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం సందర్శించారు.
ఆ ఇద్దరు చిన్నారుల చిత్రాల దిగువ ప్రధాని మోది.. నిన్నటి రోజున నా ఇద్దరు చిన్నారి మిత్రులు నన్ను కలవడానికి సేవా తీర్ద్ కు వచ్చారు అని చెప్పుకురావడంతో.. ఎవరా చిన్నారులు అని అంతా ఆరా తియ్యడం మొదలు పెట్టారు.
నల్లా ఛానెల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి, గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. బ్యాటర్లందరూ సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ ఈ స్కోరును సాధించగలిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ థర లీటర్ కు 2.61 రూపాయలు, డీజిల్ ధర లీటర్ కు 2.71 రూపాయలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, డీజిల్ ధర రూ.95.20కు చేరింది.
ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు
కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.