సిద్దిపేట జిల్లాలో కాకతీయ గణపతిదేవుని శిల్పం గుర్తింపు

Publish Date:May 25, 2026

Advertisement

మొత్తం తెలుగు నేలను సా.శ.1199 నుంచి సా.శ.1262 వరకు ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాకతీయ గణపతిదేవుని శిల్పం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, చరిత్రకారుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్,  రామోజు హరగోపాల్ తెలిపారు.
 పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం (మే 24)  సందర్శించారు. ఆ సందర్భంగా బెజ్జంకి మండలం తోటపల్లిలోని వారసత్వ తెలంగాణ శాఖ రక్షిత కట్టడమైన కాకతీయుల కాలపు శివాలయం రంగమండపంలోని ఒక శిల్పం ముమ్మాటికి కాకతీయ గణపతిదేవుడు, ఆయన భార్య సోమలదేవి,  రాచగురువు విశ్వేశ్వర శివాచార్యులదేనని శివనాగిరెడ్డి, హరగోపాల్ చెప్పారు.

రాచగురువు సమక్షంలో శివదీక్ష  తీసుకున్న గణపతిదేవుడు, రాచరికపు చిహ్నాలను పక్కన పెట్టి, తలపై శిఖ, వంటిపై రుద్రాక్షమాలలను ధరించి, శివలింగానికి పుష్పాభిషేకం చేస్తున్నట్లు, ద్రవిడ తమ్మిల్ల కేశాలంకారణతో నున్న సోమలదేవి కూడా పూజలో నిమగ్నమైనట్లు, చక్రవర్తికి కుడివైపున రాజగురువు గోళకి మఠాధిపతి విశ్వేశ్వర శివాచార్యుడు వారి చేత పూజలు చేస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడని వారన్నారు.

 చక్రవర్తి, ఆయన భార్య, రాచ గురువుల తలలపైన రాజలాంఛనాలైన ఛత్రాలు ఉన్నాయని, ఎడమవైపున వింజామర వీస్తున్న పరిచారిక ఉన్న ఈ శిల్పం తోటపల్లి శివాలయం కాకతీయ వాస్తు శైలిలో  నిర్మించబడిందని, అందుచేత చక్రవర్తి గణపతిదేవుడు, సోమలదేవిగా గుర్తించినట్లు శివనాగిరెడ్డి, హరగోపాల్ చెప్పారు. 

 60 ఏళ్లకు పైగా పాలించిన కాకతీయ గణపతిదేవుని ఈ శిల్పం, తెలంగాణలో గుర్తించిన వాటిలో మొదటిదని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారసత్వ ప్రేమికుడు, లాంకో హిల్స్ ఎండి అండ్ సీఈవో, సింహాద్రి వెంకట్రామరెడ్డి, ఆలయ పూజారులు కైలాసపతి, కవిత, గ్రామస్తులు ముక్తా బీరయ్య, బిలమేని సంపతి, దయ్యాల ఐలేష్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేష్ పాల్గొన్నారని వారు చెప్పారు.

By
en-us Political News

  
ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ఇరువురి మధ్యా ఆవేశాలు తగ్గలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు.
ఆ ఇద్దరు చిన్నారుల చిత్రాల దిగువ ప్రధాని మోది.. నిన్నటి రోజున నా ఇద్దరు చిన్నారి మిత్రులు నన్ను కలవడానికి సేవా తీర్ద్ కు వచ్చారు అని చెప్పుకురావడంతో.. ఎవరా చిన్నారులు అని అంతా ఆరా తియ్యడం మొదలు పెట్టారు.
నల్లా ఛానెల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి, గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. బ్యాటర్లందరూ సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ ఈ స్కోరును సాధించగలిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ థర లీటర్ కు 2.61 రూపాయలు, డీజిల్ ధర లీటర్ కు 2.71 రూపాయలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, డీజిల్ ధర రూ.95.20కు చేరింది.
ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు
కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ డి. జోయల్ డేవిస్ వెల్లడించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.