టి20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్షిష్టం

Publish Date:Feb 23, 2026

Advertisement

టీ20 ప్రపంచకప్  సూపర్ 8 లో భాగంగా నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమితో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్షిష్టంగా మారాయి. సూపర్ 8లో భారత్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలోనూ విజయం సాధించినా టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వడం అంత తేలిక కాదు.  భారత్ సెమీస్ కు చేరాలంటే.. వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలచినా నెట్ రన్ రేట్ కీలకం కానుంది.  

భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే జట్టు ఖాతాలో  4 పాయింట్లు ఉంటాయి. అయితే దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి, అదే సమయంలో వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విజేత కూడా దక్షిణాఫ్రికాను ఓడిస్తే, అప్పుడు మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లతో భారత్‌తో సమానంగా నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నెట్ రన్‌రేట్ ఆధారంగానే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. 

కాగా ఆదివారం (ఫిబ్రవరి 22)న దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ టోర్నీలో తన తొలి ఓటమిని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 76 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. టీమ్ ఇండియా బ్యాటర్లలో శివం దుబే 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక టీమ్ ఇండియాను కట్టడి చేసే విషయంలో సఫారీ బౌలర్లు సమష్టిగా చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీసుకుని భారత్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు.  

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు.
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని మంత్రి లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు.
ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో కథ ముగిసింది.
ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రేపటి నుంచి వాటి వసూళ్లు నిలిపివేయనున్నారు.
ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దు పోరాటం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది
భారత్ వాయుసేనలోని మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు, ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్న మంత్రి గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు.
నిన్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడంపై కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలానికి చెందిన బీయారామ్ చౌదరి కుమార్తె వైష్ణవి అల్వాల్‌లోని లయోలా కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు ఎన్‌సీసీ నేవీ వింగ్‌లో కూడా సభ్యురాలిగా కొనసాగుతోంది. ఆమె సాయిబాబా నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో స్నేహి తులతో కలిసి నివాసం ఉంటుంది.
ఎండలతో అల్లాడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.