రాజమహేంద్రవరంలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
Publish Date:Feb 23, 2026
Advertisement
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీ పాలు తాగి రజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో ఇద్దరు మరణించారు. మృతెలలొ చౌడేశ్వర్ నగర్‌కు చెందిన కృష్ణవేణి , కనకరత్నంగా గుర్తించారు. మరో 13 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కల్తీపాలు సేవించడమే ఇందుకు కారణమంటున్నారు. కాగా చౌడేశ్వరి నగర్ లో గత 5 రోజులుగా కల్తీ పాల కారణంగా పలువురు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. వీరంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వీరంతా చికిత్సపొందుతున్నారు. తాజాగా ఇద్దరు చికిత్స పొందుతూ మరణించడం, అలాగే బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కల్తీ పాల ఘటనపై అధికారులను ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని ఆదేశించారు.కల్తీ పాలు సరఫరా అయిన కాలనీలలో కాలనీల్లో 13 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/adultrated-milk-in-rajahmahendravaram-36-214520.html





