హైదరాబాద్ మెట్రో స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం
Publish Date:Feb 23, 2026
Advertisement
తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు స్వాధీనంపై ఇదివరకే ప్రభుత్వం ప్రకటన చేసింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావులతో ఈ ఉపసంఘాన్ని నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకునేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్రల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 31వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ టేకోవర్ మొత్తం విలువ సుమారు రూ.15,000 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు రూ.13,000 కోట్లు కాగా, ఎల్ అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2,000 కోట్లుగా ఉంది. రెండో దశ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.
http://www.teluguone.com/news/content/cabinet-decides-to-change-the-name-of-the-medical-council-36-214557.html





