మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Publish Date:Feb 23, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే ఏడాదికి లక్ష్యాలు, సంక్షేమ పథకాల దిశానిర్దేశం వంటి అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, ప్రజా సమస్యలు సభలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. మార్చి 20న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉద్యోగాలు, మహిళా సంక్షేమం వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త పథకాలు, పన్నుల మార్పులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు బడ్జెట్‌లో ముఖ్యాంశాలుగా ఉండనున్నాయి.మార్చి 30 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో బడ్జెట్‌పై విస్తృత చర్చలు జరిగి, అనంతరం ఆమోద ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది
http://www.teluguone.com/news/content/telangana-assembly-budget-sessions-36-214559.html




