ట్రంప్ పెంచిన టారిఫ్‌లు రేపటి నుంచి బంద్
Publish Date:Feb 23, 2026
Advertisement
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో మంగళవారం (24-2-26) నుంచి వాటి వసూళ్లు నిలిపివేయనున్నారు. ఈ మేరకు పెంచిన సుంకాలు వసూలు చేయబోమని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది. ట్రంప్ విధించిన టారిఫ్‌ల వసూళ్లను అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి నిలిపివేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్‌లను రిఫండ్ చేస్తారా? లేదా? అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్ టారిఫ్‌లు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 3 రోజుల తర్వాత ప్రభుత్వం నిలిపివేతపై ప్రచటన చేయడం గమనార్హం. తీర్పు వచ్చాక కూడా ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. ప్రపంచదేశాలపై శాతం సుంకాలు విధిస్తున్నట్లు మళ్లీ ప్రకటన చేశారు. అవి ఈ నెల 24 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ.. అందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. మొత్తమ్మీద ఈ పరిణామాలతో భారత్‌పై సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగివచ్చాయి.
http://www.teluguone.com/news/content/us-president-donald-trump-36-214552.html





