నటి ఈషారెబ్బపై సోషల్ మీడియా లో దుష్ప్రచారం.. యువకుడు అరెస్ట్
Publish Date:Mar 4, 2026
Advertisement
ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బపై సోషల్ మీడియాలో అసభ్య, దూషణలు చేసిన యువకు డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌కు చెందిన 26 ఏళ్ల రుషిత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి నటి ఈషా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అనుచిత పోస్టులు చేశాడు. రీల్ మాయ-1 పేరుతో తెరిచిన అకౌంట్ ద్వారా ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై నటిపై అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టడంతో పాటు ఆమెపై తప్పుడు ప్రచారం చేశాడు. దీనిపై నటి ఈషా రెబ్బ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత సోషల్ మీడియా సంస్థలతో సమాచార మార్పిడి జరిపి, ఐపీ అడ్రస్‌లు, డిజిటల్ ట్రైల్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అమీర్‌పేట్‌లో హాస్టల్‌లో నివసిస్తూ సినిమా ల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రుషిత్‌ను అదుపు లోకి తీసుకుని విచారించగా నకిలీ ఖాతాలను తానే నిర్వహించినట్లు అంగీకరించాడు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు.
http://www.teluguone.com/news/content/social-media-campaign-against-actress-eesha-rebba-36-214984.html





