సచిన్ రికార్డ్ బ్రేక్ చేయనున్న వైభవ్ సూర్యవంశీ

Publish Date:Apr 14, 2026

Advertisement

 

తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు. ఈ యువ చిచ్చర పిడుగు దూకుడుగా ఆడుతూ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. 15 ఏళ్ల ఈ కుర్రాడిని సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు ఇతర యువ ఆటగాళ్లతో పాటు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో సూర్యవంశీకి కూడా చోటు దక్కినట్లు సమాచారం. 

అదే జరిగితే.. భారత్‌ తరఫున జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇప్పటివరకు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(16 ఏళ్లు) పేరిట ఉంది. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో నిన్న హైదరాబాద్‌పై తప్ప.. మిగతా నాలుగు మ్యాచుల్లోను దూకుడుగా ఆడేశాడు.

ఐపీఎల్‌ ముగిసిన కొన్ని రోజులకే టీమిండియా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో షార్ట్‌లిస్ట్‌లో వైభవ్‌కు చోటు దక్కినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.  ఐర్లాండ్‌ పర్యటనలో చక్కటి ప్రదర్శన చేస్తే.. జింబాబ్వేతో సిరీస్‌కూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం16 ఏళ్ల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన టెండూల్కర్, భారత పురుషుల జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా అయితే ఈ రికార్డు షఫాలీ వర్మ పేరిట ఉంది. ఆమె 15 ఏళ్ల 7 నెలల 27 రోజుల వయస్సులో భారత మహిళల జట్టులోకి అరంగేట్రం చేసింది

By
en-us Political News

  
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.