ఇకపై లోక్ సభలో 850 స్థానాలు

Publish Date:Apr 14, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్దమైంది. ఈ నెల 16 రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దానిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చి, బిల్లు ప్రతులను వారికి పంపింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. అంటే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి పెరుగుతాయని తెలుస్తోంది. 

లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని చూస్తోంది.సీట్ల పెంపుతో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందలో వచ్చిన లెక్కల ఆధారంగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశముందని దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతధంగా కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు.  

By
en-us Political News

  
ఈ నెల 19 నుండి వచ్చే నెల 31 వరకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
గమ్యానికి చేరుకోవడానికి కేవలం ఇరవై నిమిషాల దూరంలో ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Publish Date:Apr 14, 2026
ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఆ లోగా తమ సమస్యలు పరిష్కరించాలనీ లేకుంటే థియేటర్ల మూత తప్పదని స్పష్టం చేసింది.
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.