మంత్రి లోకేష్ 88వ ప్రజాదర్బార్... కార్యకర్తలకు భరోసా

Publish Date:Apr 14, 2026

Advertisement

 

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చిన సామాన్యులు, టీడీపీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకలించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. నంద్యాల జిల్లా జూపాడు మండలం 35 బొల్లవరం, తాటిపాడు, భాస్కరాపురం గ్రామాల పరిధిలోని సుమారు 72 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22(ఏ)1(సి)లో చేర్చారని, విచారించి ఆయా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

ఆయా భూములు వారసత్వంగా తమకు సంక్రమించాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్న టూవీలర్స్ మెకానిక్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టూవీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని ముదిరాజ్ సంఘం ఆంధ్రపదేశ్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్న విజయ్ కలాంకు మంత్రి లోకేష్ అభినందన

అంతకుముందు డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ దండి మార్చ్ 2.O పేరుతో తిరుపతి నుంచి విశాఖ వరకు వెయ్యి కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపట్టిన వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ్ కలాంను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి మంత్రి అభినందించారు. ఇప్పటివరకు విజయ్ కలాం 549 కి.మీల సైకిల్ యాత్రను పూర్తిచేశారు. 

By
en-us Political News

  
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు.
అథ్లెటిక్స్ ప్రపంచంలో పరుగు అంటేనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఆయన సృష్టించిన రికార్డులు దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.
రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.