సైకిల్‌పై తిరుగుతూ ఆ వృద్ధుడు ఏం చేస్తున్నాడంటే?

Publish Date:Apr 2, 2026

Advertisement

చూడటానికి వృద్ధుడు. చాలా సాధారణంగా ఉంటాడు. జీవనం గడిపేందుకు చిన్న కిళ్లీ కొట్టు నడుపుతుంటా. అతడి వాహనం సైకిల్. చేతిలో సైకిల్ఇది బయటకు కనిపించేది. కానీ ఈ వృద్ధుడికి మరో వ్యాపకం ఉంది. అదే అసలు వ్యాపారం.  హైదరాబాద్ నగరంలో గత ఆరు నెలలుగా ఆయన అత్యంత రహస్యంగా చేస్తున్న వ్యాపారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.  

జియాగూడకు చెందిన అరవై ఏళ్ల బావుద్దీన్   ఓ చిన్న కిళ్లీ కొట్టు యజమానిగా మాత్రమే అందరికీ తెలుసు..  కానీ ఈజీ మనీ కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. ధూల్‌పేట్‌లో గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో సైకిల్‌పై తిరుగుతూ విక్రయించేవాడు.

గత ఆరునెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగించాడు. పోలీసులకు ఇసుమంతైనా అనుమానం రాకుండా అత్యంత పకడ్బందీగా, చాకచక్యంగా ఈ మత్తు వ్యాపారం సాగించాడు.  10 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను ధూల్ పేటలో 250 రూపాయలకు కొని రెట్టింపు లాభానికి అంటే  500కు విక్రయిస్తూ  లాభాలు ఆర్జిస్తున్నాడు.   రోజుకు తక్కువలో తక్కువ   10 ప్యాకెట్లు విక్రయిస్తూ గత ఆరు నెలలుగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.  

ఇందిరానగర్ ప్రాంతంలో ఓ వ్యక్తికి గంజాయి విక్రయిస్తున్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 30 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాధారణంగా కనిపించిన ఈ వృద్ధుడి రహస్య గంజాయి వ్యాపారం బయటపడటంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు.  

By
en-us Political News

  
గృహ వినియోగానికి సంబంధించిన మొత్తం 3,699 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి 70 చిన్న ఎల్పీజీ సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నసిలెండర్ల విలువ 1.10 కోట్లు రూపాయలుగా అధికారులు అంచనా వేశారు.
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్‌లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో మావిగన్ కు కౌంటర్‌గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్‌పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది.
కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది.
అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు రిజిస్ట్రేషన్ చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు.
హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్ర దేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ లకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
మూసి నది ప్రక్షాళన లో ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కార్తీక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ పరిసరాల్లో ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ కార్యాలయాలపై దాడులు నిర్వహించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. బెంగళూరులో కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.