హోర్మూజ్ పై 35 దేశాల చర్చలు.. భారత్‌కు ఆహ్వానం

Publish Date:Apr 3, 2026

Advertisement

హోర్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు   ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ విషయమై చర్చించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 3)  35 దేశాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో  పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని  భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.

భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ  శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.  భారత్ ఇప్పటికే ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఈ విషయమై చర్చలు జరుపుతోందన్న ఆయన.. హోర్ముజ్ మీదుగా సరకు రవాణాకు అంతరాయం కలగకుండా తమ వంతు ప్రయాత్నాలను చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. భారత్‌కు చెందిన ఆరు నౌకలు సురక్షితంగా హోర్ముూజ్‌ను దాటగలిగాయని అన్నారు. 

తాజాగా శుక్రవారం జరగే ఈ  సమావేశంలో భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ తదితర దేశాలు పాల్గొంటున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్   పేర్కొన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. హోర్ముజ్ జలసంధి మీదుగా ఎవరి ముడి చమురును వారే తెచ్చుకోవాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో  పేర్కొంటూ  ఎల్లకాలం అమెరికా సాయంగా రాదన్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

By
en-us Political News

  
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.